E-Paper
Advertisement

Tirumala Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

Tirumala Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
Advertisement

Tirumala Tickets: తిరుమల శ్రీవారిని నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) జనవరి కోటా రేపు(అక్టోబర్ 25)న ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తిరుమల, తిరుపతి వసతి గదుల బుకింగ్ రేపు మధ్యాహ్నం 03:00 గంటలకు అందుబాటులో ఉంటుంది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 200) టికెట్లు నవంబర్ కోటా రేపు ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

అక్టోబర్ 25న పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి

Advertisement

తిరుమలలో అక్టోబర్ 25న నాగుల చవితి ప‌ర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభ‌య‌ దేవేరుల‌తో క‌లిసి దర్శనమివ్వనున్నారు. వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునిదే అని పండితులు తెలిపారు.

తిరుమల ప్రధాన జలాశయాలు జలకళ

తిరుమలలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వరదనీటి ప్రవాహంతో మొత్తం ఐదు జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమ‌ల‌కు 215 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయి.

Advertisement

Also Read: Trolling On Jagan: బీకామ్‌లో ఫిజిక్స్.. డేటాకు మైండ్ అప్లై చేస్తే ఏఐ, అయ్యో జగన్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×