// // Tirumala Adulterated Ghee Case: వైసీపీకి అమావాస్య ఘడియలు.. సుబ్బారెడ్డి ఇంటికి సిట్ అధికారులు -->
E-Paper
Advertisement

Tirumala Adulterated Ghee Case: వైసీపీకి అమావాస్య ఘడియలు, వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సిట్

Tirumala Adulterated Ghee Case: వైసీపీకి అమావాస్య ఘడియలు, వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సిట్
Advertisement

Tirumala Adulterated Ghee Case: అమావాస్య అంటే ఎలాంటి మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టరు. కానీ వైసీపీ నేతలకు అమావాస్యం అంటే ఇష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరేళ్ల తర్వాత వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టుకి హాజరవుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సీబీఐ సిట్ అధికారులు వచ్చారు. ఆయన్ని ఈ కేసులో విచారించనున్నారు.

వైసీపీకి వెంటాడుతున్న అమావాస్య ఘడియలు

Advertisement

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు వేగంగా చేస్తోంది సీబీఐ సిట్‌. ఈ కేసులో నెయ్యి సరఫరా చేసిన కంపెనీ ప్రతినిధులు విచారించిన సీబీఐ, చాలామందిని అరెస్టు చేసింది. ప్రస్తుతం టీటీడీ విభాగంలోని కీలకంగా మారిన అప్పటి అధికారులపై దృష్టి పెట్టింది.  ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నను పలుమార్లు సిట్ విచారించింది. అప్పటి టీటీడీ బాస్‌ల ప్రమేయంతో చేసినట్టు వారిద్దరు చెప్పినట్టు తెలుస్తోంది. అంతకుమించి తమకు ఏమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశారట.

తాజాగా ఈ కేసులో వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి గురువారం ఉదయం సిట్ అధికారులు వచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఇంట్లోనే ఆయన్ని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాలు దగ్గర పెట్టి మరీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నెయ్యి సరఫరా చేసిన కంపెనీ ప్రతినిధులు, అలాగే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, పీఏ చిన్న అప్పన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా వైపీపై ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సిట్, ఆపై విచారణ

సిట్ అధికారులు  అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే ఈ రోజు ఆయన విచారణ పూర్తి కావచ్చని,  ఒకవేళ కీలక ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుంటే రేపు కూడా విచారణ చేయవచ్చని అంటున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలుకానున్నాయి. ఈలోగా ఆయన్ని విచారించాలన్నది సిట్ అధికారుల ఆలోచన. సుబ్బారెడ్డిని విచారిస్తే సిట్ దర్యాప్తు దాదాపుగా పూర్తి అయినట్టే. దాన్ని విశ్లేషించి నివేదికను సుప్రీంకోర్టుకు అందించనుంది.

ALSO READ:  ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టుకి జగన్, న్యాయస్థానానికి  గంట సమయం కేటాయింపు

కల్తీ నెయ్యి కేసులో హవాలా లింకులు బయటపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో 12 రాష్ట్రాల్లో విచారణ చేసిన సిట్, ఢిల్లీ కేంద్రంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. భోలేబాబా డైరెక్టర్లు.. కొంత మొత్తాన్ని కల్తీ నెయ్యి తయారీ కోసం నకిలీ రికార్డులు తయారు చేసి కంపెనీలకు హవాలా రూపంలో నిధులు చెల్లించినట్టు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడు.. ఎవరెవరికి ఎంత చెల్లించారు? ఏజెంట్లుగా ఎవరు వ్యవహరించారు? వాటిని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు అధికారులు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×