E-Paper
Advertisement

Kakinada Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. అన్నదమ్ములు మృతి

Kakinada Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. అన్నదమ్ములు మృతి
Advertisement

Kakinada Road Accident: ఆదివారం ఉదయం కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. గండేపల్లి మండలం మురారి వద్ద ఓ బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ బైక్ ను గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వారి తల్లి తీవ్రగాయాల పాలవ్వగా.. ఆమెను రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాద ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన సంగలం దుర్గ (40)కు ముగ్గురు కొడుకులు రాజు (18), ఏసు (18), అఖిల్ (10) ఉన్నారు. కొడుకులతో కలిసి కూలిపనులు చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. కూలిపనుల్లో భాగంగా నర్సీపట్నం వెళ్లిన నలుగురు.. బైక్ పై తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురారి శివారు ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అందరూ కిందపడిపోయారు.

Advertisement

Also Read : వామ్మో కోచింగ్ సెంటర్ లోకి వదరనీరు..ముగ్గురు మృతి

పైకిలేచేలోపే వెనుకనుంచి వచ్చిన ఒక వాహనం బైక్ ను ఢీ కొట్టి వారి మీదినుంచి వెళ్లడంతో.. రాజు, ఏసు, అఖిల్ లు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. తల్లి దుర్గకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని ఢీ కొట్టిన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×