E-Paper
Advertisement

YSRCP : వైసీపీ నేతలు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఇదే!

YSRCP : వైసీపీ నేతలు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఇదే!
Advertisement

ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నేతల ఆగడాలు శృతి మించుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు తెలుస్తున్నది.అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో ఇష్టానుసారంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని బూతులు మాట్లాడటం, దాడులకు పాల్పడటంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులకు చేస్తున్నట్టు సమాచారం. జగన్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు పెద్దఎత్తున ఇల్లీగల్ వ్యాపారాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.విశాఖ జిల్లాలోని మన్యంలో గుట్టుగా గంజాయి పండిస్తూ వాటిని విశాఖతో పాటు ఏపీ మొత్తం వ్యాప్తి చేయడం, తెలంగాణకు సైతం సరఫరా చేస్తున్న ముఠాలకు నాటి వైసీపీ నేతలు అండగా ఉన్నారని సైతం ఆరోపణలొచ్చాయి. దీనంతటికీ నాడు పార్టీ అధినాయకత్వం సైతం చూసీ చూడకుండా వ్యవహరించడంతో కొందరు నేతలు భారీగా డబ్బులు సంపాదించుకున్నట్టు తెలుస్తోంది.

ఆ బడా నేతల అండ.. ఆర్థికసాయం

2019లో వైసీపీ నుంచి గెలిచిన దాదాపు 90 శాతం సభ్యులు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కొందరు గుట్టుగా నాడు పరిచయమున్న అధికారుల అండతో అక్రమ వ్యాపారాలు చేస్తూ భారీగా డబ్బులు సంపాదించుకుంటున్నట్టు తెలుస్తున్నది. వీరే రాష్ట్రంలోని నేతలకు ఆర్థికంగా సపోర్టు చేస్తున్నట్టు సమాచారం. ఇకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించేలా చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి కొందరు వైసీపీ నేతలు గుట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.ఇదే విషయంపై గతంలో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.అందుకే రాష్ట్రంలో వైసీపీ నేతలు, మాజీ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అశాంతిని రేకెత్తించాలని చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు దీటుగా ఎదుర్కొంటున్నారు.

ఓవైపు అసెంబ్లీ, మరోవైపు వెలుపలా..

Advertisement

వైసీపీ నేతలు ప్రజల్లో అటెన్షన్ కొట్టేసేందుకు, వారి హయాంలో జరిగిన అవినీతి, చేసిన అప్పులు, వారిపై ఉన్న కేసుల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు సర్కారుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. జగన్ సీఎంగా ఉన్నంతకాలం అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం విధ్వంస పాలన సాగించారని, నాడు ప్రభుత్వంపై ప్రశ్నిస్తే దాడులకు పాల్పడిన విషయాలను గుర్తుచేస్తున్నారు. అంతేకానీ, ప్రతిపక్షంతో ఏనాడూ మర్యాదగా మెలగలేదని, నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు సైతం కేటాయించలేదని చెబుతున్నారు. అలాంటి పార్టీకి చెందిన నేతలకు కూటమి సర్కార్ చేస్తున్న అభివృద్ధికి కంటికి కనిపించదని,కేవలం విషప్రచారం చేసి పార్టీని ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నదని.. దీని వెనుక జగన్ హస్తం ఉందని, ఆయన అనుమతి లేకుండా వారు ఇంత ధైర్యం చేయలేరని చెబుతున్నారు.

LPG Supply Rules: సామాన్యులకు భారీ ఊరట.. వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

Advertisement

అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగకుండా సభలో గందరగోళం సృష్టించడం, బయట కూడా రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం వంటివెనుక వైసీపీ మాస్టర్ మైండ్ హస్తం ఉందని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు ఆర్థికంగా బలంగా ఉండటం, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు పార్టీలో ఉండటం, ఇష్టానుసారంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వలన రాష్ట్రంలో అశాంతికి కుట్ర చేయడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. దీనంతటి వెనుక మాజీ సీఎం జగన్, సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యూహాలు ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి సర్కారుకు నివేదికలు అందినట్టు చర్చ జరుగుతున్నది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×