E-Paper
Advertisement

Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
Advertisement

Kadapa District: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో కొన్ని గ్రామాల్లో విచిత్రమైన ఆచారం కొనసాగుతోంది. బూచుపల్లె, భద్రంపల్లె, లోమడ్, బోడివారిపల్లె, మల్లెల్, తొండూరు, ఇనాగ్లూరు, సంతకవూరు, అగడూరు లాంటి చుట్టుపక్కల గ్రామాల్లో బూచుపల్లె వంశస్థులకు చెందిన కుటుంబాలు వెయ్యికి పైగానే ఉంటాయి. అయితే ఇది కేవలం వారికే సాంప్రదాయమే కాదు.. దైవిక ఆదేశాలతో ముడిపడిన ఆచారం. పెళ్లి మండపంలో తాళి కట్టిన వెంటనే వరుడిని మూడు కొరడా దెబ్బలు కొట్టడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది.

మంగళవాయిత్రాలు మనసు మెరిసేలా మిరిసిన మండపం.. వధువు పచ్చని చీరలో అలంకరించబడి పెళ్లి మండపంలో కూర్చుని ఉంటుంది… వరుడు సౌమ్యమైన స్వభావంతో మెడలో తాళిని కడుతుంటాడు. పెళ్లికూతరికి తాళి కట్టిన వెంటనే.. మండపంలో ఒక వింత శబ్దం.. టప్.. టప్..టప్.. వరుడి సోదరులు లేదా బంధువులు, ఒక చిన్న కొరడా (కర్ర వంటి చిన్న డబ్బ)తో మెల్లగా మూడు దెబ్బలు కొడుతారు. ఇది ఎలాంటి ఆగ్రహానికి సంబంధించినది కాదు..  దైవిక ఆజ్ఞ పాటించడం కోసం బూచుపల్లె వంశస్థులు ఈ ఆచారాన్ని కొన్ని వందల ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. వరుడు అలా నవ్వుతూ.. మండపంలో కుటుంబ సభ్యులు, బంధువుల చిరునవ్వులు చెప్పుకుంటూ.. ఆచారం పూర్తవుతుంది. ఈ కొరడా దెబ్బల్లో చాలా అర్థం ఉంటుంది. అవి దంపతుల జీవితంలో ఐక్యత, సహనం, దైవభక్తిని సూచిస్తాయి. శతాబ్దాలుగా ఈ ఆచారం సంస్కృతి గొప్పతనాన్ని చాటుకుంటోంది.

Advertisement

ALSO READ: VC Sajjanar: ఆర్టీసీతో నాలుగేళ్ల ప్రయాణం ముగిసింది.. వీసీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్

ఈ ఆచారానికి మూలం ఓ పెద్ద కథే ఉంది. శతాబ్దాల క్రితం, బూచుపల్లె పూర్వీకులు గంగమ్మ దేవాలయం నుంచి ఒక దైవానికి సంబంధించి వస్తువును (పెట్టె) తప్పుగా తీసుకువచ్చారు. ఇంట్లో తెరిచి చూస్తే.. అందలో ఆరు కొరడాలు (కర్రలు) ఉన్నాయి. తమ తప్పును గ్రహించి బూచుపల్లి వంశస్థులు దేవతకు క్షమాపణ కోరారు. అప్పుడు గంగమ్మ అమ్మవారు ప్రత్యక్షమై.. ‘మీ వంశంలో జరిగే ప్రతి పెళ్లిలో, తాళి కట్టిన తర్వాత వరుడికి మూడు కొరడా దెబ్బలు కొట్టాలి’ అమ్మ వారు ఆదేశించారు. ఆ క్షణం నుంచి ఈ ఆజ్ఞను పూర్తిగా పాటిస్తూ.. వారు దైవిక అనుగ్రహాన్ని పొందారని నమ్ముతారు. ఇక అప్పటి నుంచి దీన్ని ఆనవాయితీగా ఈ వంశస్థులు పాటిస్తున్నారు.

Advertisement

ALSO READ: Bathukamma Festival: సరూర్‌నగర్ స్టేడియంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. ఒకేసారి 1500 మంది మహిళలతో గిన్నిస్ రికార్డ్..!

ఈ ఆచారం ఆధునిక కాలంలో కూడా మారకుండా ఉండటం నిజంగా హైలెట్ అని చెప్పవచ్చు. యువత, టెక్నాలజీ యుగంలో కూడా ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. ఇది కేవలం ఒక ఘటన కాదు.. సంస్కృతి, ఆచారాల ప్రత్యేకత, దైవికతతో ముడిపడిన మానవ జీవితాన్ని సూచిస్తుంది. బూచుపల్లె వంశస్థుల ప్రతి కొరడా దెబ్బలో దాగి ఉన్నది స్నేహం, సహనాన్ని సూచిస్తుంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×