E-Paper
Advertisement

Amaravathi : చంద్రబాబును వెంటాడుతున్న జనాల భయం..!

Amaravathi : చంద్రబాబును వెంటాడుతున్న జనాల భయం..!
Advertisement

సీఎం చంద్రబాబును ఏపీ ప్రజల భయం వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేశారు.అక్కడే రానున్న రోజుల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టునున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌‌ను మించేలా రాజధానిని తయారు చేయాలని సంకల్పించినట్టు తెలుస్తోంది. అయితే, గతంలో రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌ను ఇలాగే డెవలప్‌చేస్తే ప్రస్తుతం తమకు రాజధాని లేకుండా పోయిందని.. రానున్న రోజుల్లోనూ ఇలాంటి పరిస్థితులు వస్తే కేవలం అమరావతి చుట్టుపక్కల జిల్లాల వారే బాగుపడతారని, అక్కడి భూముల రేట్లు పెరుగుతాయని.. మరి తమ పరిస్థితి ఏంటని రాయలసీమ ప్రజలు భయాందోళనకు గురవుతున్నట్టు సమాచారం.

ఏ పరిష్కారం చూపుతారు?

అమరావతిని ఏపీ రాజధానిగా ఎంపిక చేశాక గతంలో మాదిరిగా తప్పులు జరగకుండా ఉండేందుకు కూటమి సర్కార్ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. గుంటూరు- అమరావతి మధ్య రాజధాని రూపుదిద్దుకుంటే అటు పొరుగురాష్ట్రమైన తెలంగాణ నుంచి కూడా ప్రజలు ఏపీ రాజధానికి వచ్చి వ్యాపారాలు చేసి ఇక్కడ టాక్స్ చెల్లించడం వలన ఏపీకే మేలు కలుగుతుంది. దీనికి తోడు ఉత్తరాంధ్రలో మౌలిక సదుపాయాల కల్పన, భోగాపురం ఎయిర్ పోర్టుతో ఆర్థికంగా, వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయని సర్కార్ భావిస్తున్నది.ఇక మిలిగింది రాయలసీమ ప్రాంతం. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి కడప జిల్లాను బాగా అభివృద్ధి చేశారు. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టారు. ఇక చిత్తూరులో తిరుపతి ఉన్నందున అక్కడ టూరిజం బాగా డెవలప్ అయ్యింది. మిలిగిన అనంతరం, కర్నూలు చాలా వెనకబడి ఉన్నాయి.

న్యాయ రాజధాని..

Advertisement

ఉమ్మడి ఏపీలో కర్నూలు న్యాయ రాజధానిగా కొంతకాలం కొనసాగింది. ఇప్పుడు కూడా అక్కడి ప్రజలు ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక వసతులను పెద్దఎత్తున కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పంచింది. గత వైసీపీ ప్రభుత్వం సైతం అందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పుడు కూటమి సర్కార్ కూడా అందుకు సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోనుందని సమాచారం. మాజీ సీఎం జగన్ సైతం ఒకే దగ్గర లక్షల కోట్లు కుమ్మరించి రాజధానిని అభివృద్ధి చేసేబదులు అన్నిప్రాంతాలను సమానంగా డెవలప్ చేస్తే బెటర్ అని ఆయన అంటున్నారు. గతంలో మూడు రాజధానులు అన్న జగన్.. తాజాగా ‘మావిగన్’ను తెరమీదకు తెచ్చారు.మరల వైసీపీ అధికారంలోకి వస్తే ఇదే పద్ధతిని ఫాలో కానుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ కొత్త ట్రాన్స్‌ఫర్మేషన్?.. నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్

Advertisement

ప్రస్తుతం చంద్రబాబు సైతం రాయలసీమ అభివృద్ధికి ముందుగా వెనుకబడిన ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలకు సాగు, తాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నారు. దీనికి తోడు అనంతపురం వంటి జిల్లాల్లో సోలార్, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పాలని కూటమి సర్కార్ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. రాజధాని అభివృద్ధితో పాటు వెనుకబడిన అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తామని సర్కారు చెబుతోంది. అయితే, అందుకు కాస్త సమయం పడుతుంది. ఈ విషయాన్ని కూటమి నేతలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. అప్పుడే వారికి భయం పోయి భరోసా వస్తుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×