E-Paper
Advertisement

Rayudu Murder Case: జనసేన వినూత పీఏ హత్య కేసులో సంచలన విషయాలు

Rayudu Murder Case: జనసేన వినూత పీఏ హత్య కేసులో సంచలన విషయాలు
Advertisement

Rayudu Murder Case: శ్రీకాళహస్తికి చెందిన యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో విచారణ జరిగే కొద్దీ కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎంక్వైరీలో భాగంగా పలు కీలక అంశాలను గుర్తించారు. మొత్తం ఐదుగురు నిందితుల్ని అదుపులోనికి తీసుకున్నారు. ఎంక్వైరీ అనంతరం గోపీ, బాషా, శివకుమార్, కోట వినూత, కోట చంద్రబాబును అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరైన శివకుమారే హత్య చేసినట్లు గుర్తించారు.

రాయుడు హత్య కేసులో అసలేం జరిగిందో ఓసారి గమనిస్తే.. చెన్నై మింట్ పీఎస్ పరిధిలోని కూపం నదిలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లుగా ఈనెల 8న పోలీసులకు సమాచారం అందింది. మొదట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన తమిళనాడు పోలీసులు.. ఆ తర్వాత విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పరిశీలించడంతోపాటు సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్నంగా అధ్యయనం చేశారు. చివరకు మృతుడి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా చనిపోయింది జనసేన కార్యకర్త శ్రీనివాసులు అలియాస్ రాయుడుగా తేల్చారు పోలీసులు.

Advertisement

ఈ కేసులో ఐదుగురు నిందితుల్ని అదుపులోనికి తీసుకున్నారు చెన్నై పోలీసులు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి గోపీ, బాషా, శివకుమార్, కోట వినూత, కోట చంద్రబాబును అరెస్ట్ చేశారు. కేసు విచారణలో భాగంగా నిందితుల నుంచి ఒక్కో విషయాన్ని రాబట్టారు ఖాకీలు. ఈనెల 8న రాయుడి మృతదేహాన్ని కాళహస్తి నుంచి సొంత వాహనంలోనే కోట వినూత, కోట చంద్రబాబు తీసుకెళ్ళినట్టు గుర్తించారు. దారి మధ్యలో తిరువళ్ళూరు నుంచి రాయుడి డెడ్ బాడీనీ.. తమిళనాడు నెంబర్ ప్లేట్‌ ఉన్న వాహనంలోకి మార్చిన విషయాన్ని తెలుసుకున్నారు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహాన్ని తరలించిన వాహనాన్ని చెన్నై పోలీసులు సీజ్ చేశారు.

ALSO READ: Janasena Party: మురికి కాలువలో వినూత పీఏ మృతదేహం.. చంపింది ఎవరు ?

Advertisement

మృతుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ కోట వినూత వ్యక్తిగత పీఏగా పనిచేసేవాడు. అయితే.. కొన్ని రోజుల క్రితమే రాయుడిని ఉద్యోగం నుంచి తొలగించారు వినూత. ఈ విషయంపై ఓ బహిరంగ ప్రకటన కూడా ఇచ్చారామె. రాజకీయ ప్రత్యర్థులతో తమపై కుట్ర చేశాడని ఆరోపిస్తూ రాయుడికి, తమకు ఇకపై ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటన చేయడం అప్పట్లోనే నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.  ఇక, కోట వినూత అరెస్ట్ కావడంపై స్పందించింది జనసేన. పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరించారని చెబుతూ.. జనసేన నుంచి ఆమెను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది.

ALSO READ: AP Politics : జనసేనను చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది ఇదేనా!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×