// // Kolikapudi Warning: ఎమ్మెల్యే కొలికపూడికి పల్లా శ్రీనివాస్‌ వార్నింగ్ -->
E-Paper
Advertisement

Kolikapudi Warning: పిచ్చి పిచ్చి స్టేటస్‌లు పెడితే కుదరదు.. కొలికిపూడిపై పల్లా శ్రీనివాస్ ఫైర్

Kolikapudi Warning: పిచ్చి పిచ్చి స్టేటస్‌లు పెడితే కుదరదు.. కొలికిపూడిపై పల్లా శ్రీనివాస్ ఫైర్
Advertisement

Kolikapudi Warning: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ (TDP) క్రమశిక్షణ విషయంలో ఎంత కఠినంగా ఉందో తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, అసెంబ్లీ స్పీకర్ పల్లా శ్రీనివాసరావు గట్టి హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాస్ ఈ భేటీ నిర్వహించి కొలికిపూడికి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.

ఈ సమావేశంలో పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.‘పార్టీ ఉంటేనే నాయకులు ఉంటారు.. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా జీరో అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని ఆయన కొలికిపూడికి హితవు పలికారు. ఇటీవల కొలికిపూడి వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

ముఖ్యంగా కొలికిపూడి శ్రీనివాసరావు తన వాట్సాప్ స్టేటస్‌లలో పెడుతున్న కొన్ని పోస్టులపై పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వాట్సాప్‌లో పిచ్చి పిచ్చి స్టేటస్‌లు పెడుతూ అసలు ఎవరిపై పోరాటం చేస్తున్నారు?’ అని పల్లా నిలదీశారు. ప్రభుత్వానికి లేదా పార్టీకి నష్టం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరికాదని.. ఇలాంటి చర్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని మందలించారు.

ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వారు బాధ్యతాయుతంగా మెలగాలని.. వ్యక్తిగత ఎజెండాల కంటే పార్టీ క్రమశిక్షణ, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పల్లా ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఈ హెచ్చరికతోనైనా కొలికిపూడి తన వైఖరి మార్చుకుంటారో లేదో వేచి చూడాలి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×