E-Paper
Advertisement

TDP Praja Galam Yatra: టీడీపీ రెండో విడత ప్రజాగళం యాత్ర .. షెడ్యూల్‌ ఖరారు..

TDP Praja Galam Yatra: టీడీపీ రెండో విడత ప్రజాగళం యాత్ర .. షెడ్యూల్‌ ఖరారు..
Advertisement

Chandrababu Prajagalam Yatra Schedule

Chandrababu Prajagalam Yatra Schedule(AP elections news): ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ప్రచారంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ప్రజాగళం పేరుతో తొలి విడత ప్రచారం పూర్తి చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్నారు.

Advertisement

ప్రజాగళం యాత్ర మరోసారి చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. రెండో విడత ప్రచారానికి షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నుంచి యాత్ర చేపట్టనున్నారు. మొత్తం 5 రోజులపాటు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.  ఏప్రిల్‌ 3న కొత్తపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 4న కొవ్వూరు, గోపాలపురంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5న నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ప్రజాగళం యాత్ర చేపడతారు.

ఏప్రిల్ 6న పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఏప్రిల్ 7న పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. దీంతో రెండో విడత ప్రజాగళం యాత్ర ముగుస్తుంది.

Advertisement

Also Read: పల్నాడులో వైసీపీకి షాక్, బాబుతో ఎమ్మెల్సీ జంగా భేటీ, అందుకే..

రోజూ సాయంత్రం 4 గంటలకు ఒక నియోజకవర్గంలో సభ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మరో సభ నిర్వహిస్తారు. ప్రజాగళం యాత్ర తొలివిడతలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 15 నియోజకవర్గాల్లో  రోడ్‌ షోలు నిర్వహించారు.

రెండో విడతలో 10 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇలా విడతల వారీగా అన్ని నియోజకవర్గాలు చుట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×