E-Paper
Advertisement

Taneti Vanitha: బాలయ్య సినిమా అప్పుడు 20 పొట్టేళ్లు నరికితే కనపడలేదా?: మాజీ మంత్రి తానేటి వనిత ఫైర్

Taneti Vanitha: బాలయ్య సినిమా అప్పుడు 20 పొట్టేళ్లు నరికితే కనపడలేదా?: మాజీ మంత్రి తానేటి వనిత ఫైర్
Advertisement

Taneti Vanitha: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ప్లెక్సీలపై సినిమా డైలాగులు రాస్తే కేసులు పెట్టడం, నల్లజర్లలో కార్యకర్తను నడిరోడ్డుపై నడిపించడం వంటి చర్యలు దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

రక్త తర్పణం చేసిన వారిని ఊరి నుంచి బహిష్కరించాలని హోంమంత్రి అనిత అంటున్నారని, మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజున థియేటర్ల వద్ద 20 పొట్టేళ్ల తలలు నరికి దండలు కట్టినప్పుడు హోంమంత్రికి అది జీవహింసలా, రాక్షస సంస్కృతిలా కనిపించలేదా అని వనిత సూటిగా ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతిని ప్రవేశపెట్టిందే టీడీపీ అని, ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ ప్లెక్సీలకు టీడీపీ కార్యకర్తలు రక్తంతో తర్పణం చేసినప్పుడు హోంమంత్రి కళ్లు మూసుకున్నారా అని నిలదీశారు.

Advertisement

మా వాళ్లకు పోలీసులతో ‘ట్రీట్మెంట్’ ఇప్పిస్తానంటూ హోంమంత్రి మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారం, చట్టాన్ని చేతిలోకి తీసుకునే అర్హత పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. జగన్‌ను దూషిస్తేనే మంత్రి పదవి ఉంటుందని అనిత భావిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆమెకు పట్టడం లేదని విమర్శించారు.

రాజధాని రైతులు మోసపోయామని గ్రహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కూటమి నేతలు ‘జీవహింస’ అంటూ డ్రామాలు ఆడుతున్నారని వనిత ఆరోపించారు. ప్రభుత్వం ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, జరుగుతున్న దాడులన్నింటినీ ‘డిజిటల్ బుక్’లో నమోదు చేయాలని సూచించారు. తాము అధికారంలోకి వచ్చాక బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Read Also:Bhatti Vikramarka: దేశానికే దిక్సూచి కాంగ్రెస్.. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం: డిప్యూటీ సీఎం భట్టి

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×