E-Paper
Advertisement

Suspicious person at Airport: ఎయిర్‌పోర్టులో జగన్, అనుమానాస్పద వ్యక్తి, పోలీసులు అదుపులో..

Suspicious person at Airport: ఎయిర్‌పోర్టులో జగన్, అనుమానాస్పద వ్యక్తి, పోలీసులు అదుపులో..
Advertisement

CM Jagan london tour updates(AP news today telugu):

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలకు ముప్పు పొంచివుందా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. తాజాగా సీఎం జగన్ లండన్ టూర్ వెళ్లారు. పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టు వెళ్లారు.

ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టులో ఉండగానే అనుమానాస్పదంగా తిరిగాడు ఓ వ్యక్తి. పోలీసులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను అమెరికాకు చెందిన డాక్టర్ తుల్లూరు లోకేష్‌గా గుర్తించారు. ఆయనకు అమెరికన్ సిటిజన్ షిప్ ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఫారెన్ టూర్‌పై ముందుగానే ఆ డాక్టర్ కొన్ని మెసేజ్‌లు ఇతరులకు పంపించనట్టు గుర్తించారు పోలీసులు. విచారణ సమయంలో గుండెపోటు రావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఏపీలో ఎన్నికలు ముగియడంతో న్యాయస్థానం అనుమతితో సీఎం జగన్ లండన్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. అక్కడ సీఎం జగన్‌కు పార్టీ నేతలు జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొట్టు సత్యనారాయణ వంటి నేతలు సెండాఫ్ ఇచ్చారు. మళ్లీ మే 31న సీఎం జగన్ ఏపీకి తిరిగి రానున్నారు.

ALSO READ:  కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కీలక నాయకులను అల్లరిమూకలు టార్గెట్‌గా చేసుకున్నట్లు వార్తలు లేకపోలేదు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముప్పు పొంచివుందన్న నేపథ్యంలో కేంద్రం భద్రతను పెంచింది. ఇప్పుడున్న 12 బదులు 24 మంది బ్లాక్ కమెండోలను కేటాయించింది. రెండు షిప్టుల్లో వీరంతా పని చేయనున్నారు. ఈ సమయంలో ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరగడం కలకలం రేపుతోంది. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×