E-Paper
Advertisement

Viveka Murder Case : జగన్ కు ముందే తెలుసు.. సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Viveka Murder Case : జగన్ కు ముందే తెలుసు.. సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Advertisement

Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వివేకా కుమార్తె సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి హత్య గురించి జగన్‌కు ముందే తెలుసని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టు సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సునీత స్వయంగా పలు అంశాలను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలతోపాటు అనేక అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.

అవినాష్‌ సీబీఐ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. 3సార్లు నోటీసులిచ్చినా విచారణకు హాజరుకాలేదన్నారు. అరెస్టును తప్పించుకునేందుకు తల్లి ఆరోగ్యాన్ని సాకుగా చూపించారని ఆరోపించారు. సాక్షులను ఎంపీ అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అవినాష్ రెడ్డికి సహకరిస్తోందన్నారు. కడప ఎంపీకి అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతు ఉందని సునీత ఆరోపించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×