E-Paper
Advertisement

SI Suicide: తణుకులో విషాదం.. తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

SI Suicide: తణుకులో విషాదం.. తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య
Advertisement

SI Suicide: తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో ఉన్నతాధికారులు వీఆర్ కు పంపించారు. ఇవాళ ఉదయం స్టేషన్ కు  వెళ్లిన ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం తణుకు రూరల్ పోలీస్టేషన్ లో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇటీవల ఎస్ఐ‌పై పలు అవినీత ఆరోపణలు రావడంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. ఈ తరుణంలో ఆత్మహత్యకు పాల్పిడినట్లు తెలుస్తోంది. ఏజీఎస్ మూర్తి తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తనపై అవినీతి ఆరోపణలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. దీంతో శుక్రవారం మార్నింగ్ పోలీస్టేషన్‌కు వచ్చిన మూర్తి.. తోటి పోలీసులు చూస్తుండగానే.. తుపాకీతో కాల్చుకున్నారు.

Advertisement

వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఎస్ఐ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మూర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న అతన్ని కుంటుబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకపోయిన సస్పెండ్‌కు గురవడంతో తమ కుమారుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే ఎస్ఐ మూర్తి ఆత్మహత్య జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: సైబర్ నేరస్తులతో బ్యాంక్ అధికారులు కుమ్మక్కు.. కోట్లు దోపిడీ.. నకిలీ ఖాతాల గేమ్

Advertisement

ఇదిలా ఉంటే.. ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులకు ఆటోడ్రైవర్‌ బలి అయ్యాడు. ఫేస్‌బుక్‌లో సూసైడ్‌ నోట్‌ పోస్టు చేసి సత్తిబాబు అనే డ్రైవర్ సూసైడ్ చేసుకున్నాడు. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీలో 7 లక్షల 80 వేల లోన్ తీసుకున్న సత్తిబాబు ఈ నెల EMi చెల్లించలేదు. తన భార్యకు హెల్త్‌ ఇష్యూస్‌ రావడం వల్లే లేట్‌ అయిందని కంపెనీ ప్రతినిధులకు చెప్పినప్పటికి వినలేదు. ఇంటిని తాకట్టు పెట్టి లోన్‌ తీసుకున్నారని.. ఈ నెల 28న ఇంటి గోడకు నోటీస్‌ అంటించారు. అంతటితో ఆగకుండా ఆటో స్టాండ్‌కు వెళ్లి విస్తార్ కంపెనీ ప్రతినిధులు నానాయాగీ చేశారు. తన చావుకు విస్తార్‌ కంపెనీ ప్రతినిధులే కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి చనిపోయాడు. భార్య, ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.\

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×