E-Paper
Advertisement

Threat to CM Chandrababu: సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు, రంగంలో కౌంటర్ యాక్షన్ టీమ్‌లు

Threat to CM Chandrababu: సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు, రంగంలో కౌంటర్ యాక్షన్ టీమ్‌లు
Advertisement

Threat to CM Chandrababu: సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో ఎందుకు మార్పులు చేశారు? మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి వుందా? భద్రతా వలయంలో కౌంటర్ యాక్షన్ బృందాలు దిగేశాయా? అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

మావోయిస్టుల నుంచి సీఎం చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో భద్రతను మరింత పెంచింది కేంద్రం. సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు చేరిపోయాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ప్రజలతో ఉండేందుకు ఇష్టపడుతున్నారు సీఎం చంద్రబాబు.

Advertisement

ఏ పథకం ప్రారంభించినా ప్రజల మధ్య చేస్తున్నారు. ఒకానొక దశలో తన సెక్యూరిటీని సైతం తగ్గించుకునే వాదన లేకపోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలకు టూర్ వెళ్లినప్పుడు కాన్వాయ్ వద్దకు ఎవరైనా వస్తే, వెంటనే ఆపి వారితో మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు భద్రతపై ఇంటెలిజెన్స్ ఎలాంటి రిపోర్టు కేంద్రానికి ఇచ్చిందో తెలీదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సెక్యూరిటీలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ టీమ్స్ వచ్చి చేరాయి. బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎస్ఎస్జీ సిబ్బందితోపాటు అదనంగా కౌంటర్ యాక్షన్ టీమ్ వచ్చి చేరాయి. సీఎం రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉండేలా ఆరుగురు కమాండోలు నిత్యం విధుల్లో ఉంటారు.

Advertisement

ALSO READ:  నవశకానికి ‘నమో’దయం – విశాఖలో మోదీ పర్యటన

సీఎం చంద్రబాబు ఇకపై ముడంచెల భద్రతలో ఉండనున్నారు. తొలి అంచెల ఎన్ఎస్‌జీ, రెండో వలయంలో ఎస్ఎస్‌జీ, మూడో అంచెలో సాయుధ బలగాలు ఉంటాయి. వీరికి కొద్ది దూరంలో కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉండనున్నారు. ఈ కమాండోలు ప్రధాని భద్రత పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకున్నవారే. వీరికి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ సైతం ఉంటుంది.

2019-2024 మధ్య కాలంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండేవారు.  ప్రజల్లోకి వెళ్లే సమయంలో దాడులు జరిగాయి. దీంతో ఎన్ఎస్‌జీ కమాండోల సంఖ్యను కేంద్రం పెంచింది. ఇంట్లో ఉన్న సమయంలో ఆరుగురు విధుల్లో ఉండేవారు. బయటకు వెళ్లే సమయంలో ఆ సంఖ్యను 12కి పెంచారు. నిత్యం కంటికి రెప్పలా సీఎం చంద్రబాబు వెంటనే ఆయా బలగాలు ఉండనున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×