// // Tata-Ernakulam Train Fire: ఎర్నాకులం రైలు ఘటన.. కొత్త విషయాలు బయటకు -->
E-Paper
Advertisement

Tata-Ernakulam Train Fire: ఎర్నాకులం రైలు ఘటన.. కొత్త విషయాలు బయటకు, డీఆర్ఎం సహా అధికారులు బోగీల పరిశీలన

Tata-Ernakulam Train Fire: ఎర్నాకులం రైలు ఘటన.. కొత్త విషయాలు బయటకు, డీఆర్ఎం సహా అధికారులు బోగీల పరిశీలన
Advertisement

Tata-Ernakulam Train Fire: ఎలమంచిలిలో రాత్రి ఎర్నాకులం రైలులో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా పరిశీలించారు.  ఘటన ఎలా జరిగిందని అధికారుల నుంచి ఆరా తీశారు.  కొన్ని విషయాలు అధికారులు ఆయనతో పంచుకున్నారు. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు.

ఎలమంచిలిలో ఎర్నాకులం రైలు ఘటన

Advertisement

ఈ సందర్భంగా మాట్లాడిన డీఆర్ఎం.. ప్రయాణికుడి మృతి చెందిన విషయం ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశామని చెప్పారు. అంతేకాదు మృతుడి ఫ్యామిలీకి ఐదులక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని, ప్రాథమికంగా ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అటు రైల్వే డీఐజీ సత్య యేసుబాబు ఎలమంచిలి రైల్వేస్టేషన్‌కి చేరుకున్నారు. తొలుత ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ప్రమాదానికి గురైన రైల్వే బోగీలను పరిశీలించారు. ఎలమంచిలి రైల్వే‌స్టేషన్ కంటే ముందు మంటలు రావడాన్ని ప్రయాణికులు గమనించారని అన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

జోరుగా దర్యాప్తు.. డీఆర్ఎం సహా అధికారుల పరిశీలన

ఏసీ బోగీలో సీసీ కెమెరాలు ఉన్నాయని, అయితే మంటల వేడికి కరిగిపోయాయని వాటిని పరిశీలన చేస్తున్నామని అన్నారు. డేటా రికవరీ చేస్తే అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు. మరోవైపు ఎర్నాకుళం అగ్నిప్రమాదం ఘటనలో రైల్వే విద్యుత్ లైన్లు తెగిపోయాయి.

మంటలకు వైర్లు మెల్ట్ అయిపోవడంతో వాటిని తొలగించారు రైల్వే సిబ్బంది. దాదాపు 500 మీటర్ల మేర విద్యుత్తు రైల్వే లైను డిస్టర్బ్ అయ్యింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా కొత్త విద్యుత్ లైన్ వేశారు.  అగ్నికి ఆహుతి అయిన బోగీల్లో చనిపోయిన చంద్రశేఖర్ సుందరం మృతి దేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ALSO READ: ఎర్నాకుళం రైలు ప్రమాదం.  ప్రత్యక్ష సాక్షి కీలక విషయాలు వెల్లడి

పోస్టుమార్టం చేసిన తర్వాత బంధువులకు ఆయన డెడ్ బాడీని అందజేశారు. ఆ వెంటనే విద్యుత్తు లైన్ల పునరుద్ధరణ చేపట్టారు. ఎర్నాకుల రైలు ప్రమాదానికి సంబంధించి వివరాలను నోట్ రూపంలో విడుదల చేసింది రైల్వేశాఖ. బీ1, ఎం2 బోగీల్లో అగ్నికీలలు చుట్టు ముట్టాయని తెలిపింది.

ముందస్తు చర్యల్లో భాగంగా ఎం1 బోగీని తొలగించినట్టు తెలిపింది. కాలిపోయిన బోగీల ప్లేస్‌లో మూడు బోగీలను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. సామర్లకోటలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలియజేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×