E-Paper
Advertisement

Somireddy Deeksha: అక్రమ మైనింగ్ పై సోమిరెడ్డి దీక్ష.. పోలీసుల లాఠీచార్జ్

Somireddy Deeksha: అక్రమ మైనింగ్ పై సోమిరెడ్డి దీక్ష.. పోలీసుల లాఠీచార్జ్
Advertisement
latest news in andhra pradesh

Somireddy Deeksha(Latest news in Andhra Pradesh):

అవీనీతి అక్రమాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామ సమీపంలోని రుస్తుం, భారత్ మైన్ లో జరుగుతున్న అవీనీతి అక్రమాలపై మాజీ మంత్రి సత్యాగ్రహ దీక్ష చేశారు. పోలీసులు‌ సోమిరెడ్డి దీక్షను భగ్నం చేశారు .

అడ్డుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలపైకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పోలీసులు టిడిపి నాయకులు , కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. అక్రమ మైనింగ్ కు సోమిరెడ్డి వ్యతిరేకంగా 4 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. డిసెంబర్ 18న భారీ సంఖ్యలో హిజ్రాలు సోమిరెడ్డి దీక్ష శిబిరం వద్దకు వచ్చి దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించారు.

Advertisement

లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు దీక్షను విరమించాలని సోమిరెడ్డిని కోరారు. అక్రమ మైనింగ్ పై కోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ చేస్తేనే దీక్షను విరమిస్తానని సోమి రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో శిబిరం వద్ద ఉండేందుకు నలుగురికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.

అనుమతి ఇచ్చినప్పటికీ డిసెంబర్ 19 తెల్లవారుజామున 2.30 గంటలకు భారీ సంఖ్యలో పోలీసులు దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. సోమిరెడ్డిని బలవంతంగా జీప్ లోకి ఎక్కించారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు.

Advertisement

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×