E-Paper
Advertisement

Tirupati: కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం

Tirupati: కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం
Advertisement

Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని గంగుడుపల్లెలో అర్ధరాత్రి హత్య కలకలం రేపుతోంది. ఓ వ్యక్తిని కారులో కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు . దీంతో ఆ వ్యక్తి మంటల్లో సజీవదహనమయ్యాడు. మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగరాజుగా గుర్తించారు. నాగరాజు తిరుపతి నుంచి బ్రాహ్మాణపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిలో గోల్డ్ చైన్, చెప్పులను లభ్యం చేసుకున్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. నాగరాజు మరణవార్త విని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

హత్య కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుల కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలిలో దొరికిన వస్తువుల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×