E-Paper
Advertisement

A.P:తాగిన మైకంలో నాగుపాముతో సయ్యాటలాడాడు.. అంతే మరి

A.P:తాగిన మైకంలో నాగుపాముతో సయ్యాటలాడాడు.. అంతే మరి
Advertisement

snake bite a drunken man at A.P.Satyasai district kadiri
తాగింది కూసింత..ఊసింది ఊరంతా అని ఈ సామెత సరిగ్గా ఆ తాగుబోతుకు సరిపోతుంది. సాధారణంగా తాగుబోతుల్లో కొందరు తాగి సైలెంట్ గా ఎలాంటి హడావిడీ చేయకుండా ఇంటికి వెళిపోతారు బుద్ధిమంతుల్లా..మరికొందరు తాగి రోడ్డున పడి నానా యాగీ చేస్తుంటారు. రోడ్లపైనే డ్యాన్స్ చేస్తూ తుళ్లుతూ, తూగుతూ ప్రమాద కర ట్రాఫిక్ లో రోడ్డును దాటుతుంటారు. ఒక్కోసారి యాక్సిడెంట్ కు కూడా గురవుతుంటారు. లేదా డ్రైవింగ్ చేస్తూ వీళ్లే జనాన్ని చంపేస్తుంటారు. రాత్రంతా వీరంగం వేసిన వీళ్లు పొద్దున్న లేవగానే రాత్రి జరిగిందంతా మర్చిపోతుంటారు. అయితే తాగుబోతుల్లో కొందరు ప్రమాదకర జంతువులతో చెలగాటం ఆడుతుంటారు. సరిగ్గా ఓ యువకుడు అదే పని చేశాడు. తాగిన మైకంలో ఓ భయంకరమైన విషసర్పాన్ని పట్టుకోబోయాడు.ఏపీలో పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో కదిరిలో జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా జనం విస్తుపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. నాగపాముతో ఆ తాగుబోతు యువకుడు చేసిన విన్యాసం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

పాముతోనే సయ్యాటలు

Advertisement

అందరూ నడిచే మార్గంలో ఓ నాగపాము నడి రోడ్డుపై బుసలు కొడుతూ పడగవిప్పి కనిపించింది. దాంతో భయాందోళనలకు గురైన ప్రజలు అటు దిక్కుగా ఎవరూ వెళ్లొద్దని వారిస్తున్నా వినకుండా ఓ తాగుబోతు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాసేపు దానికి దగ్గరగా వచ్చి కవ్వించాడు. పాము బుసలు కొట్టే కొద్దీ మన తాగుబోతుకు మంచి కిక్ వచ్చినట్లయింది. ఇంకేముందు జనం అరుస్తుంటే దానిని తనేదో ఘనకార్యం చేసినట్లు, ధైర్యవంతుడైనట్లు ఫీలయ్యాడు. పాపం ఇవేమీ పట్టని పాము మాత్రం తన ఆత్మరక్షణ కోసం బుసలు కొడుతూనే ఉంది. చాలా మంది ఈ తతంగాన్ని అంతా వీడియోలు తీశారు. కొద్ది సేపు జనాలకు మన తాగుబోతు కావలసినంత వినోదాన్ని పంచాడు. కొందరు ఆకతాయిలు అన్నా ఏ మాత్రం తగ్గొద్దు అంటూ ఎంకరేజ్ చెయ్యడం ఆరంభించారు. కొందరు పెద్ద వాళ్లు మాత్రం తాగుబోతును పోతావు అని హెచ్చరించారు. ఇవన్నీ పట్టనట్లుగా తాగుబోతు పాముతో సయ్యాటలు ఆరంభించాడు. దానినుంచి తప్పించుకుంటూ దానిని అటూ ఇటూ చేతితో పొడుస్లూ పాము ఆగ్రహానికి లోనయ్యాడు. ఒక్కసారిగా పాము రివర్స్ అయింది. అంతే ఫోర్స్ గా తాగుబోతు వైపు తిరిగి కసాకసా అంటూ కాటు వేసింది. ప్రస్తుతానికి ఆ మందుబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×