E-Paper
Advertisement

ఏపీలో విస్తరిస్తున్న కరోనా.. కొత్తగా ఆరు కేసులు నమోదు, ఆయా జిల్లాల ప్రజలకు అలర్ట్

ఏపీలో విస్తరిస్తున్న కరోనా.. కొత్తగా ఆరు కేసులు నమోదు, ఆయా జిల్లాల ప్రజలకు అలర్ట్
Advertisement

Corona Alert In AP: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరోనా వైరస్ చాపకింద నీరుగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో ఆరు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు అక్కడ కేసుల సంఖ్య 32కు చేరింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తం అయ్యింది ఏపీ ప్రభుత్వం.

ఏపీలో విస్తరిస్తున్న కరోనా- ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం నాడు మరో ఆరు కేసులు నమోదయ్యాయి. అందులో మూడు తూర్పుగోదావరి జిల్లా, మరో మూడు విశాఖపట్నంలో నమోదు అయ్యాయి. ఆరు కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదు అయిన కేసుల సంఖ్య 32 కి చేరింది. రోజు రోజుకూ కేసులు పెరుగుతుండడంతో వైద్య అధికారులను కాస్త కలవరపెడుతోంది.

Advertisement

కొత్తగా ఆరు కేసులు నమోదు- కడప జిల్లాలో సేకరించిన నమూనాల్లో ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5 ఉన్నట్లు తేలడంతో  పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రభుత్వాసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెడీగా ఉందన్నారు.

ఆయా జిల్లాల ప్రజలకు అలర్ట్-ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స, పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తోంది. కరోనా విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తున్నారు. ఏమైనా స్వల్ప లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.

Advertisement

ఆసుపత్రుల్లో ఏర్పాట్లు- ఏపీలోని 17 ఆసుపత్రుల్లో 255 ప్రత్యేక వార్డులను సిద్ధం చేసింది ప్రభుత్వం. సాధారణ మాస్కులు, ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచింది. టెస్టింగ్ కిట్లు, రెమిడిసివిర్‌ను స్థానికంగా కొనుగోలు చేసేందుకు సూపరింటెండెంట్లకు అధికారాలు అప్పగించింది.

ALSO READ: దేశమంతా రుతుపవనాల జోరు..  ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు, హైదరాబాద్ మాటేంటి?

మరోవైపు కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు  వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్‌.  గత అనుభవాల దృష్ట్యా దశల వారీ కార్యాచరణ రెడీ చేయాలని సూచన చేశారు. ఇప్పటివరకు కడప జిల్లాలో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి.

గుంటూరు-6, తూర్పుగోదావరి-6, విశాఖపట్నం-3, కాకినాడ, బాపట్ల జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు నమోదు అయినట్టు తెలిపారు. ఇక పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేసులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో ఈ వ్యాధి బారిన పడి ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. కొంతమంది హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు కోలుకుంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×