E-Paper
Advertisement

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సంచలన వీడియో.. మొత్తం డబ్బుల కట్టలే..!

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సంచలన వీడియో.. మొత్తం డబ్బుల కట్టలే..!
Advertisement

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ చేతికి కీలక వీడియో దొరికింది. నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు ఉన్న వీడియో సిట్ అధికారులకు లభ్యమైంది. ఆ వీడియోలో వెంకటేషన్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ ఫోన్ లోనే వీడియో లభ్యం అయినట్టు అధికారులు చెబుతున్నారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ34 గా వెంకటేష్ నాయుడు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ సంగతి తెలిసిందే.

వెంకటేష్ నాయుడిని రెండు నెలల కిందటనే పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. అందువల్ల 2 నెలల కన్నా ముందు ఈ వీడియో తీసి ఉండొచ్చని సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇది ఎప్పుడు, ఎక్కడ తీశారు అనేది క్లారిటీగా తెలియదు. వీడియోలో నోట్ల కట్టలను అతను లెక్కిస్తూ ఉన్నట్టు కనబడుతుంది. అసలు ఆ డబ్బును ఎక్కడిది..? ఎక్కడి నుంచైనా.. మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా..? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ALSO READ: Narsingh News: ప్రియురాలితో భర్త.. ఇద్దరిని పొట్టుపొట్టు కొట్టిన భార్య.. ఇదిగో వీడియో

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరో పది రోజుల్లో సిట్ అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసినప్పుడు అందులో వెల్లడిస్తుందని సమాచారం. మూడు రోజుల కిందట సిట్ రూ.11 కోట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో తెరపైకి రావడం కలకలం రేపుతోంది. ఇది ఏపీలో భారీ స్కాం కావచ్చు అని ఈ వీడియోలు, ఆధారాలూ తెలియజేస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 48 మంది నిందితులు ఉండగా.. 12 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ALSO READ: IND Vs ENG 5th Test : టీమిండియా ఓపెనర్ మరో సెంచరీ..ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో రెచ్చిపోవాల్సిందే..!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×