E-Paper
Advertisement

Visakhapatnam: విశాఖలో వైసీపీకి అధికారులు ఝలక్.. సభకు అనుమతులు నిరాకరణ, ఏం జరిగింది?

Visakhapatnam: విశాఖలో వైసీపీకి అధికారులు ఝలక్.. సభకు అనుమతులు నిరాకరణ, ఏం జరిగింది?
Advertisement

Visakhapatnam: విశాఖ సిటీలో వైసీపీకి షాక్ ఇచ్చారు వీఎంఆర్డీఏ అధికారులు. ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో బ్యానర్స్ కట్టి భారీ సభకు ఏర్పాటు చేశారు ఆ పార్టీ నేతలు. ఏం జరిగిందో తెలీదుగానీ, చివరకు పర్మీషన్ రద్దు చేశారు అధికారులు. దీంతో షాక్ కావడం వైసీపీ వంతైంది. దీని వెనుక అసలేం జరిగింది?

విశాఖలో వైసీపీకి అధికారులు ఝలక్

Advertisement

విశాఖ సిటీలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో వైసీపీ సభకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. సోమవారం చిల్డ్రన్స్ ఎరీనాలో  ఆ పార్టీలో  కార్యకర్తలు జాయినింగ్స్ కార్యక్రమం నిర్వహించేందుకు ఆ పార్టీ దరఖాస్తు చేసుకుంది. తొలుత వీఎంఆర్డీఏ అధికారులు అనుమతి ఇచ్చారు.

ఈ క్రమంలో ఉడా చిల్డ్రన్ పరిసరాల్లో భారీగా బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసుకుంది ఆ పార్టీ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు వైసీపీ నుంచి రూ.71,300 ఫీజు కూడా కట్టించుకుంది. చిల్డ్రన్స్ ఎరినాలో పార్టీ కార్యక్రమం జరగడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై రెండు మూడురోజులుగా రచ్చ సాగుతోంది.

Advertisement

సభకు అనుమతులు నిరాకరణ

పరిస్థితి గమనించిన వీఎంఆర్డీ అధికారులు చివరకు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పు తెలుసుకున్న అధికారులు..సభకు అనుమతి లేదని వైసీపీ నేతలకు తేల్చి చెప్పారు. లోపలకు ఎవరినీ రాకుండా వీఎంఆర్డీఏ సిబ్బంది అడ్డుకున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

చేరిక సభ నేపథ్యంలో అప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో గేటు వద్ద ఉండిపోయారు. ముందు రోజు ఆ పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టినప్పుడు అధికారులు ఏం చేశారంటూ మండిపడుతున్నారు. కావాలనే ఇలా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నట్లుండి కార్యక్రమంగా అర్థాంతరంగా వాయిదా పడడంతో కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ: టీడీపీకి షాక్.. జగన్ కి సపోర్టుగా కొలికపూడి

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×