E-Paper
Advertisement

YS Sharmila : సొంత పార్టీ సీఎంపైనే షర్మిల విమర్శలు.. జగన్ మెప్పు కోసమేనా!

YS Sharmila : సొంత పార్టీ సీఎంపైనే షర్మిల విమర్శలు.. జగన్ మెప్పు కోసమేనా!
Advertisement

వైఎస్ షర్మిలకు ఉన్నట్టుండి తన అన్న జగన్ మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టు ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.అందులో ఏపీకి చెందిన తెలుగు తమ్ముళ్లు ఉండగా, మరోవైపు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇంతకూ షర్మిల ఏం చేశారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె మీద అంతగా సెటైర్లు వేయడానికి కారణం ఏమై ఉంటుందని అటు నెటిజన్లు..ఇటు వైసీపీ శ్రేణులు తెగ వెతుకుతున్నారని టాక్. ఏపీ పీసీసీ చీఫ్‌గా ప్రస్తుతం కొనసాగుతున్న షర్మిల.. అక్కడి రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారని విమర్శలున్నాయి.

షర్మిల ఏం ప్లాన్ ఏంటి?

అటు ప్రజల్లో పార్టీకి ఆదరణ లేకపోవడంతో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలే లీడర్‌ అనిపించుకోవాలన్న కల ఆమెకు కలగానే మిగిలింది. అందుకే తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలా? అని ఆమె ఆలోచనలో పడినట్టు సమాచారం. మరోవైపు తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డితో విభేదాల కారణంగా ఆమె వైఎస్సార్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ నేతలు సైతం షర్మిలను లైట్ తీసుకున్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కారణంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి ఏపీలో అధికారంలోకి రావడం అసాధ్యం అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అందుకే షర్మిల తన భవిష్యత్ గురించిన ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జగన్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా?

Advertisement

వైఎస్ షర్మిల రాజకీయాల్లో ఇమడాలంటే ఒకటి జనాల్లో ఆదరణ ఉన్న పార్టీలోకి వెళ్లాలి. లేదంటే ప్రజలను మెప్పించేలా తన రాజకీయ ప్లాన్స్ ఉండాలి. రెండోది ఎలాగూ సాధ్యపడేలా కనిపించడం లేదు. ఎందుకంటే తను బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి జనంలో ఆదరణ కరువైంది.అందుకే తను ఎక్కడ మొదలెట్టిందో అక్కడే తిరిగి దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఎలాగైనా తన అన్నకు దగ్గర అయ్యేందుకు తెరవెనుక కసరత్తు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు అవసరమైతే తన తల్లి సాయం తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది.

సొంత పార్టీ సీఎంపై విమర్శలా?

ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ద్వారా వైఎస్సార్ పార్టీకి దగ్గరయ్యేందుకు ఆమె స్కెచ్ వేసినట్టు టాక్ వినిపిస్తున్నది.ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలో అఖండ పార్ట్-2 సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీ, తెలంగాణలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ, తెలంగాణ సీఎంకు చంద్రబాబు రాజకీయ గురువు అని అందరికీ తెలిసిందే. అందుకే చంద్రబాబు చెబితే రేవంత్ ఏదైనా చేస్తారు అనే టాపిక్‌ను తెరమీదకు తెచ్చారు. చంద్రబాబు చెప్పడం వల్లే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో టికెట్ రేట్లు పెంచారని ఆమె ఆరోపించింది.మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు హైదరాబాద్‌కు వెళ్లడానికి చంద్రబాబే కారణమని, అక్కడి సీఎంతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. కాగా, షర్మిల వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. జగన్ మెప్పుకోసం సొంత పార్టీ సీఎంనే బ్లేమ్ చేస్తారా? అంటూ హస్తం శ్రేణులు మండిపడుతున్నారు.

Advertisement

 

 

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×