E-Paper
Advertisement

Seetharam Thammineni: జనసేనలోకి తమ్మినేని? బొత్స భేటి.. పార్టీ మార్పుపై క్లారిటీ!

Seetharam Thammineni: జనసేనలోకి తమ్మినేని? బొత్స భేటి.. పార్టీ మార్పుపై క్లారిటీ!
Advertisement
Seetharam Thammineni: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జనసేన పార్టీలో చేరబోతున్నారా.. లైన్ క్లియర్ అయిందా.. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు మరి.. అనే రీతిలో జోరుగా ప్రచారం సాగుతోంది. తమ్మినేని సీతారాం జనసేనలో చేరితే, వైసీపీకి గట్టి షాక్ తగలడం ఖాయంగా చెప్పవచ్చు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక నేతగా వ్యవహరించారు. జగన్ వద్ద అత్యధిక మార్కులు గల నేతగా సీతారాంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో సీతారాం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉండడంతో, ఏదో ఒక పార్టీలోకి జంపు కావడం ఖాయమంటూ వార్తలు హల్చల్ చేశాయి. అంతేకాదు ఇక రేపో మాపో జనసేనలోకి వెళ్లడం ఖాయమని, ప్రచారం సైతం సాగింది.

ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలలో చేరుతున్న నేపథ్యంలో వైసిపి క్యాడర్ ను కాపాడుకునే పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. తాజాగా తమ్మినేని సీతారాం సైతం జనసేన పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై వైసీపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం తమ్మినేని సీతారాం ను కలవడం విశేషం. పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో బొత్స కలిశారా.. లేక సాధారణంగానే భేటీ జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: Borewell Incident: బోరుబావిలో 16 గంటలు.. బిడ్డ నరకం.. పూజల్లో తల్లి.. చివరికి మృత్యువు ఒడిలోకి!

అయితే ఆదివారం సాయంత్రం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. జనసేనలో చేరుతానన్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం తగదన్నారు. తన కుమారుడిని వైద్యశాలలో చేర్పించి చికిత్స అందించానని, 15 రోజులుగా వైద్యశాల వద్ద ఉన్నట్లు తమ్మినేని అన్నారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు, తనకు జనసేనలో చేరాల్సిన అవసరం ఏమి వచ్చిందని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. మాజీమంత్రి బొత్స భేటీ అనంతరం తమ్మినేని ఈ కామెంట్స్ చేయడం విశేషం.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×