// // Scrub Typhus: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కలకలం.. పెరుగుతున్న మరణాల సంఖ్య! -->
E-Paper
Advertisement

Scrub Typhus: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కలకలం.. పెరుగుతున్న మరణాల సంఖ్య!

Scrub Typhus: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కలకలం.. పెరుగుతున్న మరణాల సంఖ్య!
Advertisement

Scrub Typhus: ఏపీలో రోజురోజుకూ స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు 9 వేల 236 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1806 కేసులు పాజిటివ్‌గా తేలడం కలవరం పుట్టిస్తోంది.పైగా 15 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్న కామెంట్స్ విన్పిస్తున్నాయి.

ప్రాంతాల వారీగా చూస్తే..చిత్తూరు జిల్లాలో 444, కాకినాడ జిల్లాలో 183, విశాఖలో 143 కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్ కడప జిల్లాలో 118, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరులో 113, విజయనగరం 96, తిరుపతి జిల్లాలో 90, గుంటూరు జిల్లాలో 85, అనంతపురం జిల్లాలో 83 కేసుల చొప్పున నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. స్క్రబ్ టైఫస్ అనుమానిత మరణాల విషయానికి వస్తే.. పల్నాడు జిల్లాలో మూడు విజయనగరం, బాపట్ల, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 2 చొప్పున నమోదయ్యాయి. నెల్లూరు, అన్నమయ్య, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున స్క్రబ్ టైఫస్ మరణాలు నమోదవడం కలకలం రేపుతోంది.

Advertisement

స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి? అది ఎలా వ్యాపిస్తుంది?
స్క్రబ్ టైఫస్ అనేది ‘ఓరియెంటియా సుత్సుగాముషి’ (Orientia tsutsugamushi) అనే బాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది నేరుగా మనుషుల నుంచి మనుషులకు సోకదు. పొదల్లో, గడ్డిలో పెరిగే ‘చిగ్గర్ మైట్స్’ (Chiggers) అనే అతి సూక్ష్మమైన పురుగులు కుట్టడం వల్ల ఈ బాక్టీరియా మనుషుల రక్తంలోకి చేరుతుంది. సాధారణంగా పొలాలు, అడవులు, గార్డెన్లలో పనిచేసే వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు కుట్టిన చోట చర్మంపై చిన్న నల్లటి మచ్చ (Eschar) ఏర్పడుతుంది, ఇది సిగరెట్ కాలిన గాయంలా కనిపిస్తుంది.

ప్రధాన లక్షణాలు, గుర్తించే విధానం
ఈ వ్యాధి బారిన పడిన 5 నుండి 12 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు ప్రధానంగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, కడుపు నొప్పి కూడా ఉండవచ్చు. వ్యాధి ముదిరితే చర్మంపై దద్దుర్లు రావడం, మెడలో గడ్డలు రావడం జరుగుతుంది. సకాలంలో గుర్తించకపోతే ఇది ఊపిరితిత్తులు, గుండె, మెదడుపై ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే సాధారణ జ్వరం అని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలి.

Advertisement

Also Read: సోనియాపై తప్పుడు కేసులు.. బీజేపీ ఆఫీసులను ముట్టడించిన కాంగ్రెస్ నేతలు

జాగ్రత్తలు
స్క్రబ్ టైఫస్ నుండి రక్షణ పొందడానికి వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. పొలాలకు లేదా గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. కాళ్లకు బూట్లు వేసుకోవడం శ్రేయస్కరం. పురుగులు కుట్టకుండా ఉండే ‘ఇన్సెక్ట్ రిపెల్లెంట్’ క్రీములను వాడుకోవాలి. బయట నుంచి రాగానే వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న పురుగులను తొలగించవచ్చు. ఇంటి చుట్టుపక్కల పిచ్చి మొక్కలు, గడ్డి పెరగకుండా చూసుకోవడం ద్వారా ఈ వ్యాధి కారక కీటకాలను నియంత్రించవచ్చు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×