E-Paper
Advertisement

SC on YS Jagan: జగన్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్ ఉపసంహరణ, ఆపై

SC on YS Jagan: జగన్‌కు ఊరట..  బెయిల్ రద్దు పిటిషన్ ఉపసంహరణ, ఆపై
Advertisement

SC on YS Jagan: వైఎస్ జగన్‌కు సుప్రీంకోర్టులో స్పల్ప ఊరట లభించింది. ఆయనపై ఉన్న కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు పిటిషనర్. సోమవారం వాదనల్లో అసలేం జరిగింది?

జగన్ బెయిల్ రద్దు, కేసుల విచారణ వేరే కోర్టుకి తరలించాలంటూ రెండు పిటిషన్లు వేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఈ రెండింటిపై సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్నం ధర్మాసనం విచారణ చేపట్టింది.

Advertisement

బెయిల్‌పై ఉన్న జగన్, ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించినట్టు లేదని తెలిపింది న్యాయస్థానం. ఎలాంటి సంఘటనలు జరగలేదని తెలిపింది. దీంతో ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది భావించారు. అందుకు ధర్మాసనం అనుమతించింది.

జగన్ కేసులకు సంబంధించి హైకోర్టు పర్యవేక్షణ చేస్తుందని, రోజువారీ విచారణ జరపాలని చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే విచారణ మరింత జాప్యం జరిగే అవకాశముందని అభిప్రాయ పడింది. దీంతో ఆయన పిటిషన్‌కు కొట్టివేసింది.

Advertisement

ఎంపీ, ఎమ్మెల్యేల కేసులకు సంబంధించి విచారణలో రోజువారీ చేపట్టాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. జగన్ కేసుల్లో మాత్రం శుక్రవారం మాత్రమే విచారణ చేస్తున్నారని పిటిషన్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పదేళ్లు కిందట తెలంగాణ ఏర్పడిందని, కేసుల విచారణ అక్క అడుగు ముందుకు పడలేదన్నారు. ఆరుసార్లు జడ్జీలు బదిలీ అయిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్-సీబీఐ కుమ్మక్కు అయినట్టు ఉందని, అందుకే విచారణ ముందుకు వెళ్లలేదన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×