// // Ravi Naidu on Roja: రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. రోజా, కొడాలి నాని, పేర్ని నాని’ -->
E-Paper
Advertisement

Ravi Naidu on Roja: రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. రోజా, కొడాలి నాని, పేర్ని నాని’

Ravi Naidu on Roja: రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. రోజా, కొడాలి నాని, పేర్ని నాని’
Advertisement

Ravi Naidu on Roja: తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ రవినాయుడు మాజీ మంత్రి రోజాపై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మాజీ క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన రోజాకు ప్రాథమిక విషయాలపైన కనీస అవగాహన లేదని రవి నాయుడు ఎద్దేవా చేశారు. కనీసం ఏషియా గేమ్స్ అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తిని గత ప్రభుత్వం మంత్రిని చేయడం రాష్ట్ర క్రీడాకారుల దౌర్భాగ్యమని మండిపడ్డారు. అలాగే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఆమె సంస్కారహీనతకు నిదర్శనమని, రాష్ట్రానికి పట్టిన దరిద్రం రోజా, కొడాలి నాని, పేర్ని నాని వంటి నాయకులేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

అభివృద్ధికి వైసీపీ ఆటంకాలు
రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని రవినాయుడు ఆరోపించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధులను నిలిపివేయాలని కోరుతూ ఆర్థిక శాఖ మంత్రికి వైసీపీ నేతలు లేఖలు రాయడం వారి రాష్ట్ర వ్యతిరేక విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. రాయలసీమ కోసం మొసలి కన్నీరు కార్చడం మానేసి, దమ్ముంటే కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం పోరాడాలని హితవు పలికారు. జగన్ హయాంలో సీమకు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా అని ఆయన సవాల్ విసిరారు.

చంద్రబాబు హయాంలోనే పారిశ్రామిక విప్లవం
అనంతపురానికి కియా పరిశ్రమను తీసుకువచ్చి రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చింది నారా చంద్రబాబు నాయుడేనని రవినాయుడు స్పష్టం చేశారు. ఐఐటీ, ఐసర్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను తీసుకువచ్చి రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో యువత భవిష్యత్తును జగన్ అంధకారంలోకి నెట్టేశారని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం డాలర్ విలువ కూడా తెలియని వారిని పక్కన పెట్టుకుని పాలన సాగించారని విమర్శించారు.

Advertisement

వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకున్నారని, టీటీడీ సొత్తును యథేచ్ఛగా కాజేశారని రవినాయుడు ఆరోపించారు. ప్రశ్నించిన విద్యార్థులు, యువతపై అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు భరోసా కల్పించామని, రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన వివరించారు.

Also Read: 547 కోట్లు సైబర్ స్కామ్.. ఖమ్మంలో ఇంటర్నేషనల్ సైబర్ ముఠా అరెస్ట్..

జగన్ అసెంబ్లీకి రావాలి
వైసీపీ నాయకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చించాలని రవినాయుడు సవాల్ విసిరారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. తిరుపతి వేదికగా సాగిన ఈ సమావేశంలో వైసీపీ వైఫల్యాలను, కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ఆయన పూసగుచ్చినట్లు వివరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×