E-Paper
Advertisement

Sankranti Festival: సంక్రాంతి పండుగలో కోడి పందాల జోరు.. విన్నర్‌కు థార్, రన్నర్‌కు స్విఫ్ట్!

Sankranti Festival: సంక్రాంతి పండుగలో కోడి పందాల జోరు..  విన్నర్‌కు థార్, రన్నర్‌కు స్విఫ్ట్!
Advertisement

Sankranti Festival: తెలుగు ప్రజల సంక్రాంతి పండగ వచ్చిదంటే చాలు ఎక్కడున్నా, సొంతూళ్లకు వెళ్లాలని భావిస్తుంటారు. ఎందుకంటే ఆ మజా అలాంటింది. విజయనగరం నుంచి వెస్ట్‌గోదావరి వరకు భోగి నుంచి కోడి పందాలు జోరుగా కొనసాగుతోంది. ఇక ఉమ్మడి పశ్చిమ-తూర్పు గోదావరి జిల్లాల గురించి చెప్పనక్కర్లేదు. ఏకంగా కోడి పందాలకు స్టేడియాలను తలపించేలా బరులు ఏర్పాటు చేస్తుంటారు.

సంక్రాంతి పండుగలో కోడి పందాల జోరు

Advertisement

ఓ వైపు కోడి పందాలు, మరోవైపు గుండాట, కోత లాంటి జూదాలు జోరుగా సాగుతుంటాయి. చట్టవిరుద్ధంగా ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న అధికారులు చెబుతున్నా, ఏ మాత్రం పట్టించుకోరు. కోడికి కత్తులు కట్టకుండా డింకీ పందాలు నిర్వహిస్తుంటారు. ఒక్కో పందెం దాదాపు మూడు లేదా నాలుగు గంటలపాటు పడుతుంది. కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి కూడా.

మంగళవారం నుంచి పందెగాళ్లు శ్రీకారం చుట్టారు. రాయలసీమతోపాటు తెలంగాణ, తమిళనాడు నుంచి భారీగా తరలిరావటంతో బరుల వద్ద ట్రాఫిక్‌ ఏర్పడింది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని ఏ నియోజకవర్గాల్లో చూసినా కోడి పందాల జోరు మామూలుగా లేదు. జాతి కోడెలు రావడంతో పందాలు ఆసక్తికరంగా మారాయి. కొందరు జాతి కోడిలను డింకీ పందాలను ఉపయోగిస్తున్నారు.

Advertisement

విన్నర్‌కు థార్, రన్నర్‌కు స్విఫ్ట్!

ఇదే సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు బ్యానర్లు ప్రజలను, పందెరాయుళ్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో నిర్వహిస్తున్న కోడి పందాల్లో గెలుపొందిన విన్నర్‌కు థార్, రన్నర్‌కు స్విఫ్ట్ కారు అంటూ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కొన్నిచోట్ల విన్నర్‌కు మహీంద్రా థార్, రన్నర్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ని బహుమతిగా ఇస్తామంటూ ఏర్పాటు చేశారు.

బహుమతుల వెనుక రూల్స్ చాలానే ఉంటాయి.  ఒక ఏరియాలో వేలల్లో పందాలు జరుగుతాయి. అలాంటి ఎన్ని ‘థార్’ ఇస్తారన్నదే అసలు ప్రశ్న.  పందెం రాయుళ్లను ఆకట్టుకోవడానికి ఇదో  ఎత్తుడగా చాలామంది చెబుతున్నారు. దీనికితోటు డింకీ పందాలు కూడా ఉంటాయని చెప్పకనే చెబుతున్నారు కూడా.

తొలిరోజు అంటే భోగి రోజు పందాలు పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 20 నుంచి 30 వేల పందాలు జరిగినట్టు తెలుస్తోంది. కోడి పందేలు, గుండాట, కోత వంటి ఆటల్లో రూ.100 కోట్లకు పైగా చేతులు మారినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన పలువురు రాజకీయ నేతలు, వారి పుత్ర రత్రాలు భారీగా పందాలు కాసినట్టు తెలుస్తోంది.

ALSO READ: ఈసారి సంక్రాంతికి కొత్త ట్రెండ్.. ఇదేమీ కేరళ కాదు, మన ఆత్రేయపురం

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×