E-Paper
Advertisement

Sajjala Ramakrishna Reddy : వైఎస్ మరణం వెనుక కుట్ర.. ఆ పార్టీపైనే అనుమానం.. సజ్జల సంచలన కామెంట్స్..

Sajjala Ramakrishna Reddy : షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప్రాతినిథ్యం వహించవచ్చన్నారు. ఆమె వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. బ్రదర్ అనిల్ ను గతంలో టీడీపీ నేతలు ఎలా ఆరోపించారో మేము చూశామని సజ్జల అన్నారు. ఇప్పుడేమో పక్కన నిలబడి అదే టీడీపీ నేతలు ఫోటోలు దిగుతున్నారని విమర్శించారు.

Sajjala Ramakrishna Reddy : వైఎస్ మరణం వెనుక కుట్ర.. ఆ పార్టీపైనే అనుమానం.. సజ్జల సంచలన కామెంట్స్..
Advertisement

Sajjala Ramakrishna Reddy : షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప్రాతినిథ్యం వహించవచ్చన్నారు. ఆమె వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని స్పష్టంచేశారు. బ్రదర్ అనిల్ కుమార్ ను గతంలో టీడీపీ నేతలు ఎలా విమర్శించారో తాము చూశామని సజ్జల అన్నారు. ఇప్పుడేమో పక్కన నిలబడి అదే టీడీపీ నేతలు ఫోటోలు దిగారని మండిపడ్డారు.

వైసీపీ ఏర్పాడిన తొలి రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వివేకాను బరిలోకి దించిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణంలోనూ కాంగ్రెస్ పార్టీపై అనుమానాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో చంద్రబాబు తెర వెనుక రాజకీయం కొనసాగుతోందన్నారు. ఇష్యూను డైవర్ట్ చేయడానికే బాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. అలాంటి పార్టీని తాము పట్టించుకోబోమని సజ్జల తేల్చిచెప్పారు.

Advertisement

అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం సరైందేనని సజ్జల అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వారి ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల కింద ఉన్నారన్నారు. విధుల్లో చేరాలని పలుసార్లు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను వారు ధిక్కరించారని అందుకే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించాల్సి వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×