E-Paper
Advertisement

Amaravati: కూటమి ప్రభుత్వంపై సజ్జల ఆగ్రహం, వైసీపీకి కేసుల సెగ, చాగంటి ప్రవచనాలపై కూడా

Amaravati: కూటమి ప్రభుత్వంపై సజ్జల ఆగ్రహం, వైసీపీకి కేసుల సెగ, చాగంటి ప్రవచనాలపై కూడా
Advertisement

Amaravati: వైసీపీలో ఉక్కుపోత మొదలైందా? బయటకు రాలేమని నేతలు చెప్పేశారా? అందువల్ల నేతలు యాక్టివ్ కాలేకపోతున్నారా? సజ్జల కామెంట్స్ వెనుక ఏం జరుగుతోంది? వైసీపీకి కేసు సెగ గట్టిగానే తగిలిందా? అందుకే ఆయన అలాంటి మాటలన్నారా? అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది?

వైసీపీ నేతలకు కేసుల సెగ

Advertisement

వైసీపీలో ఏదో జరుగుతోంది. అధినేత హెచ్చరించినా నేతలు బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. దీంతో నేరుగా వైసీపీ మాస్టర్ బ్లాస్టర్ సజ్జల రంగంలోకి దిగేశారు. వైసీపీ నేతల టార్గెట్‌గా కూటమి ప్రభుత్వం విచారణలు చేస్తోందని దుయ్యబట్టారు. మంగళవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చిన ఆయన, కూటమి ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో రుసరుసలాడారు.

మా పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు, మోసాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం విమర్శించారు. లిక్కర్ కేసులో అలాంటి విచారణ జరుగుతోందన్నారు. ఇప్పటివరకు ఏమైనా తేలిందా? అంటూ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సిట్‌ పాటించలేదని వెల్లడించారు.

Advertisement

కూటమి ప్రభుత్వంపై సజ్జల ఆగ్రహం

కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి విచారణలు చేస్తున్నారని ఆరోపించారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తోందని, ఏం చెయ్యాలో తెలియక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. 18 నెలల్లో  చంద్రబాబు విశ్వరూపం బయటపెట్టారని వివరించారు.

వైసీపీని భూస్థాపితం చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని, అందుకోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు సజ్జల.  సోమవారం విద్యా సదస్సులో చాగంటి ప్రవచనాలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు సజ్జల. ముఖ్యంగా చంద్రబాబు తన మీదున్న కేసులు ఎత్తేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ALSO READ: బంగాళాఖాతంలో మరో తుఫాన్.. నవంబర్ 29 నుంచి భారీ వర్షాలు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం, నకిలీ మద్యం, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వంటి వాటిపై కేసులు నమోదయ్యాయి.  వైసీపీకి చెందిన కీలక నేతలు బుక్కయ్యారు. కొందరు అరెస్టు కాగా, మరికొందరు విచారణలు ఎదుర్కొంటున్నారు. ఇంకొందరు బెయిల్‌పై బయట వున్నారు. ఈ క్రమంలో పార్టీ తరపున వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×