E-Paper
Advertisement

Vijayawada: సాయికృష్ణ కేసులో కీలక విషయాలు.. పోలీసు కస్టడీలో మృతి, మృతదేహం మాటేంటి?

Vijayawada: సాయికృష్ణ కేసులో కీలక విషయాలు.. పోలీసు కస్టడీలో మృతి, మృతదేహం మాటేంటి?
Advertisement

Vijayawada: విజయవాడ సాయికృష్ణ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి సిట్ కీలక విషయాలు బయటపెట్టంది. పోలీసు కస్టడీలో దెబ్బల కారణంగానే సాయికృష్ణ మరణించినట్టు తేల్చింది. మృతుడి ఆచూకీ, కస్టడీకి సంబంధించిన వాస్తవాలను బయటకు తెలియకుండా నిందితుడు నాగరాజు మాయం చేశాడని ప్రస్తావించింది.

సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో కీలక విషయాలు

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఐజీ రవిప్రకాశ్‌ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కేసులో నిందితుడు నాగరాజుపై వివిధ సెక్షన్ల కింద అధికారులు కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడలో కోర్టులో నిందితుడు నాగరాజు హాజరుపరిచారు సిట్ అధికారులు. కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులోని కీలక అంశాలు ప్రస్తావించారు.

నిందితుడు నాగరాజును దాదాపు 18 గంటలపాటు సిట్ అధికారులు విచారించింది.  రౌడీషీటర్‌ సాయికృష్ణ కేసులో సంచలన విషయాలు బయటపెట్టింది ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్‌. కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ కస్టడీలో సాయికృష్ణ మృతి చెందినట్టు కోర్టుకు తెలిపింది. మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలు చెరిపే ప్రయత్నం జరిగిందని ప్రస్తావించింది.

Advertisement

కస్టడీలో సాయికృష్ణ మృతి.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించిన సిట్

పాత కేసుల్లో కోర్టు వాయిదాలకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు సాయికృష్ణ. సాయికృష్ణపై మాచవరం, కృష్ణలంక పోలీస్‌ స్టేషన్లలో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మార్కాపురంలో అతడ్ని గుర్తించి మే 5 అదుపులోకి తీసుకున్నారు.అక్కడి నుంచి విజయవాడలోని కృష్ణలంక పీఎస్‌కు తీసుకొచ్చారు.

నిందితుడ్ని అరెస్టు చేసిన నాగరాజు, 24 గంటల్లోగా మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచలేదు. సీఐ నాగరాజు అదుపులో ఉన్నప్పుడే సాయికృష్ణకు గాయాలయ్యాయి. వీటికి సంబంధించి బలమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. మృతుడి ఆచూకీ, కస్టడీకి సంబంధించిన వాస్తవాలను నిందితుడైన నాగరాజు మాయం చేశాడు.

ALSO READ:  సాయిబాబాపై ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..  నేను ఆయన భక్తుడినే అంటూ

దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు సాయికృష్ణ మృతదేహాన్ని దాచిపెట్టడం లేకుంటే ఖననం చేయడం జరిగినట్టు ఉందని ప్రస్తావించింది. కృష్ణలంక స్టేషన్‌లో సాయికృష్ణ ఉన్నాడని తెలుసుకుని అతడి తల్లి మే మొదటి వారంలో అక్కడికి వెళ్లింది. లాకప్‌లో కొడుకుని చూసి ఇంటికి పంపించాలని సీఐని వేడుకున్నట్లు ప్రస్తావించారు.

పీఎస్‌లో సాయికృష్ణ మే 6 నుంచి 8 వరకు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏమయ్యాడో ఎవరికీ తెలీదని, కాకపోతే మే 8న ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ తీసుకునేందుకు స్టేషన్‌కు వెళ్లినప్పుడు సాయికృష్ణను చూశానని ఎస్సై తెలిపాడు. ఆ తర్వాత సాయికృష్ణను ఏం చేశారో ఎవరికీ తెలీదు.

న్యాయస్థానం కోరిన విధంగా మే ఒకటి నుంచి నుంచి జూన్‌ ఒకటి వరకు పీఎస్ ‌ లోపల, బయట సీసీ కెమెరాల దృశ్యాలు లేవు. కేవలం రెండురోజుల ఫుటేజ్ మాత్రమే లభ్యమైంది. అది మే 31, జూన్‌ 1న ఫుటేజీ ఉంది. సీసీటీవీ ఫుటేజీ లేకపోవడంతో స్టేషన్‌లో ఏం జరిగింది? సాయికృష్ణ ఏమయ్యాడు? అనే విషయాలు తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొంది.

సాయికృష్ణ శవం కోసం గాలించినా లభించలేదని సిట్ పేర్కొంది. అతడ్ని దాచి పెట్టారా? తగుల బెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. ఈ ఘటనలో ఎవరెవరి పాత్ర ఉందా? ఇంకా కొంతమందిని విచారించనున్నట్లు ప్రస్తావించింది. నాగరాజును ఈనెల 23న అరెస్టు చేసి విచారించినా దర్యాప్తునకు సహకరించడం లేదని పేర్కొంది.

నిందితుడు బయటుంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలియజేసింది. పోలీసు సిబ్బందిపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఈ కేసులో డిజిటల్‌, ఫోరెన్సిక్‌ ఆధారాలు ఉన్నందున నిందితుడు నాగరాజును జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపాలని సిట్ ప్రస్తావించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×