E-Paper
Advertisement

Sai Dharam Tej: అభిమాని మృతి.. టీజర్‌ వాయిదా.. రియల్ హీరో సాయిధరమ్ తేజ్..

Sai Dharam Tej: అభిమాని మృతి.. టీజర్‌ వాయిదా.. రియల్ హీరో సాయిధరమ్ తేజ్..
Advertisement

Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్. యాక్సిడెంట్ తర్వాత ఇంకా కొత్త సినిమా రాలేదు. చాలా గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ హీరో ఇప్పుడు ఎలా ఉన్నాడోనని.. తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని.. తెగ ఆరాటపడుతున్నారు. ఇలాంటి సమయంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘విరూపాక్ష’ సిద్ధమవుతోంది. ఈ బుధవారమే టీజర్ రిలీజ్ కావాల్సి ఉండే. అంతా ఎగ్జైంటింగ్‌గా టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ……..

‘విరూపాక్ష’ టీజర్ అటు తేజ్‌కు, ఇటు ఫ్యాన్స్‌కు వెరీవెరీ ఇంపార్టెంట్. అయితేనేం.. తనకు తన సినిమాకంటే కూడా అభిమానే ఎక్కువని నిరూపించుకున్నారు సాయిధరమ్ తేజ్. మెగా హీరో అనిపించుకున్నారు. తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నారు. ‘విరూపాక్ష’ టీజర్‌ను వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే? అసలేం జరిగిందంటే..?

Advertisement

హీరో సాయిధరమ్‌ తేజ్‌ భీమవరం అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న రావూరి పండు (28) అకస్మాత్తుగా చనిపోయాడు. మంగళవారం క్రికెట్‌ ఆడుతూ.. గుండెపోటు రావడంతో మృతి చెందాడు. పండు మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు సాయిధరమ్ తేజ్. అభిమాని చనిపోయిన విషాధంలో తన సినిమా టీజర్‌ను రిలీజ్ చేయలేనంటూ.. ‘విరూపాక్ష’ టీజర్‌ను వాయిదా వేసుకున్నారు. కొత్త అప్‌డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

‘రిపబ్లిక్‌’ తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తోన్న మూవీ ‘విరూపాక్ష’. కార్తిక్‌ దండు డైరెక్టర్. సంయుక్త హీరోయిన్. దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే అందించారు. మంగళవారం సాయంత్రమే టీజర్‌ను పవన్‌కల్యాణ్‌ చూసి చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. బుధవారం టీజర్ రిలీజ్ ఉండగా.. అభిమాని పండు మృతితో వాయిదా పడింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×