E-Paper
Advertisement

Delhi Airport: ఎయిర్‌పోర్టులో భేటీ.. సచిన్-చంద్రబాబు మధ్య ఏం జరిగింది?

Delhi Airport: ఎయిర్‌పోర్టులో భేటీ.. సచిన్-చంద్రబాబు మధ్య ఏం జరిగింది?
Advertisement

Delhi Airport: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబుకు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు మధ్య భేటీ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జరిగింది. ఇంతకీ అసలు మేటరేంటి?

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం చంద్రబాబుతో సచిన్ భేటీ

Advertisement

సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఎయిర్‌పోర్టులో పార్టీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు లాంజ్‌లో పార్టీ ఎంపీలతో వివిధ అంశాలపై చర్చించారు ముఖ్యమంత్రి. ఎయిర్‌పోర్టులో సీఎం చంద్రబాబు ఉన్న విషయాన్ని తెలుసుకున్న మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆయన వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇద్దరు ప్రముఖులు వివిధ అంశాలపై కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇది పూర్తిగా ఊహించని సమావేశమని ఇందులో ఏమీలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత విమానంలో ముంబైకి సచిన్ చేరుకున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు-క్రీడా దిగ్గజానికి మధ్య జరిగిన గౌరవప్రదమైన, స్నేహపూర్వక మర్యాదపూర్వక భేటీగా పరిశీలకులు అభివర్ణించారు.

Advertisement

దాదాపు పావుగంటపాలు ఇరువురు చర్చ

ఎంపీలతో సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వన్ జన్‌పథ్‌లో ఉన్న తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల వంటి అంశాలపై చర్చించనున్నారు.

చంద్రబాబు-సచిన్ మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. ఎందుకంటే 2014 లో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారి కండ్రిగ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. రాజ్యసభ ఎంపీ నిధులతో ఆ గ్రామానికి రోడ్లు, ప్రతీ ఇంటికి తాగునీరు, విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లు వంటి ఆధునిక సౌకర్యాలతో ఆదర్శ గ్రామంగా మార్చిన విషయం తెల్సిందే.

ALSO READ: ఏపీలో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధం? 

2014 లో సచిన్ ఏపీలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెల్సిందే. ఆనాటి నుంచి చంద్రబాబు-సచిన్ పలు సందర్భాల్లో భేటీ అయిన సందర్భాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఎక్స్ వేదికగా సచిన్ స్పందించారు.  సీఎం చంద్రబాబును కలవడం అనుభూతిగా వర్ణించారు. రాత్రి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశానని, ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మనసులోని మాట వెల్లడించారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×