E-Paper
Advertisement

రేవంత్ రెడ్డితో విందులా?.. టీడీపీ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకమే- రోజా

రేవంత్ రెడ్డితో విందులా?.. టీడీపీ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకమే- రోజా
Advertisement

Roja Slams TDP: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని అస్త్రంగా చేసుకుని వైఎస్సార్సీపీ నాయకురాలు రోజా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా బిల్లును గతంలో అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అలాంటి పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఫొటోలు దిగడం, విందుల్లో పాల్గొనడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. బిల్లును వ్యతిరేకించిన వారితో భోజనాలు చేస్తున్నారంటే టీడీపీ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకమేనని ప్రజలంతా గమనిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు.

మహానాడు వేదికగా టీడీపీ ఎంపీలు, నాయకులు తాము మహిళా రిజర్వేషన్‌కు అనుకూలమంటూ మళ్లీ అబద్ధాలు చెపుతున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య తెరవెనుక లోపాయికారీ బంధం (ఆర్ట్ లైన్ బంధం) ఉందంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. టీడీపీ నాయకులు పొద్దున్నే లేస్తే బీజేపీతో బ్రేక్‌ఫాస్ట్‌లు చేస్తూ, రాత్రి వేళల్లో కాంగ్రెస్ పార్టీతో డిన్నర్లు చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Advertisement

మహిళా హక్కుల పట్ల వైఎస్సార్సీపీకి ఉన్న చిత్తశుద్ధిని చాటుతూ.. 2023లోనే ముఖ్యమంత్రిగా జగన్ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేశారని రోజా స్పష్టం చేశారు. టీడీపీ ద్వంద్వ విధానాలను, వారి రాజకీయ అవకాశవాదాన్ని రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆమె హెచ్చరించారు.

Also Read: షూటింగ్‌లో సరికొత్త రికార్డు.. ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×