E-Paper
Advertisement

Ambati Arrest: ఇదేనా మీ రూల్ ఆఫ్ లా? వాళ్ల పేర్లు చెబుతూ.. మండిపడ్డ రోజా

Ambati Arrest: ఇదేనా మీ రూల్ ఆఫ్ లా? వాళ్ల పేర్లు చెబుతూ.. మండిపడ్డ రోజా
Advertisement

Ambati Arrest: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి రోజా సెల్వమణి తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి ముట్టడి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చాక ‘మీరు అమలు చేస్తున్న ‘రూల్ ఆఫ్ లా’ ఇదేనా?’ అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు రోజా. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటిపైకి వెళ్లి దాడి చేయడం మీ రాక్షసానందానికి పరాకాష్ట. ఆయన ఒక్కరే కాదు, ఇవాళ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిదని తెలిపారు మాజీ మంత్రి రోజా.

Advertisement

జోగి రమేష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని వంటి సీనియర్ నేతల ఇళ్లను ధ్వంసం చేయడం ఏ రకమైన రాజకీయం? కనీసం గౌరవప్రదమైన వయసున్న ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపై కూడా దాడికి దిగడం మీ ప్రభుత్వ సంస్కృతికి నిదర్శనమా అంటూ సీరియస్ అయ్యారు. నెల్లూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రాయలసీమలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇలా ఒకరేమిటి.. లిస్టు చాంతాడంత ఉందన్నారు.  చివరకు మహిళా నాయకురాలు విడదల రజినీ, ఉప్పల హారికలను కూడా వదలడం లేదు. ఇది పక్కాగా స్కెచ్ వేసి చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్య అంటు మాజీ మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ నాయకులను భౌతికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా, నిజాలు రాసే పత్రికల గొంతు నొక్కాలని చూస్తున్నారు. సాక్షి, డెక్కన్ క్రానికల్ ఆఫీసులపై దాడులు చేయడం ద్వారా మీరు మీడియాను భయపెట్టాలని చూస్తున్నారు. హిందూపూర్ వైసిపి ఆఫీస్ నుంచి మార్గాని భరత్ ఆఫీస్ వరకు అన్నిటినీ టార్గెట్ చేశారు. ఆర్పీ వంటి వారిని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడుతున్నారు.

Advertisement

మేము అడుగుతున్నాం.. ప్రజలు మీకు ఓట్లు వేసింది అభివృద్ధి చేస్తారనా లేక ఇలా దాడులు చేయిస్తారనా? మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఇళ్లపై గుండాలను పంపి భయబ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యమా లేక ఫ్యాక్షనిజమా? ఈ దాడుల పరంపర ఇలాగే కొనసాగితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మానుకుని, శాంతిభద్రతలను కాపాడండి అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: మున్సిపల్ ఎన్నికల వేళ షాక్.. వేములవాడ 4వ వార్డు కాంగ్రెస్ నేత మిస్సింగ్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×