E-Paper
Advertisement

Visakhapatnam: నేరగాళ్లకు టెన్షన్.. రోబో ‘అర్జున్‌’ కంట్లో పడితే మటాష్.. ఇద్దరు బుక్కయ్యారు

Visakhapatnam: నేరగాళ్లకు టెన్షన్.. రోబో ‘అర్జున్‌’ కంట్లో పడితే మటాష్.. ఇద్దరు బుక్కయ్యారు
Advertisement

Visakhapatnam: బస్సు స్టేషన్లు, రైల్వేస్టేషన్లు దొంగలకు కేరాఫ్‌గా ఉండేవి. దొంగలను పట్టుకునేందుకు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ భారీగా పోలీసులు మొహరిస్తుంటారు. ఇకపై పోలీసులకు ఆ శ్రమ అక్కర్లేదు. రోబో ఏఎస్సీ అర్జున్‌కు అప్పగిస్తే చాలు, ఆ పని మరింత సులువుగా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు క్రిమినల్స్‌ను పట్టించింది. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

విశాఖ రైల్వేస్టేషన్‌లో నేరగాళ్ల కోసం రోబో అర్జున్ వేట

Advertisement

రోబోలు ఒక్కో వ్యవస్థలోని క్రమంగా ఎంట్రీ ఇస్తున్నాయి. మనుషులుండే ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పుడు రోబోలు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. రీసెంట్‌గా విశాఖ రైల్వేస్టేషన్‌లో రోబో ‘ఏఎస్‌సీ అర్జున్‌’ ఇంట్రీ ఇచ్చింది. రాత్రి ఇద్దరు దొంగలను పట్టించింది. వినడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో హ్యూమనాయిడ్‌ రోబో అనబడే ఏఎస్‌సీ అర్జున్‌ చూసి నేరస్తులు బెంబేలెత్తిపోతున్నారు. అర్జున్‌కి కనిపించకుండా ఉండేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది ‌రోబో. నేరస్థుల వివరాలు పోలీసులు అధికారలు అప్‌లోడ్‌ చేసి ఉండడంతో స్టేషన్‌కు వచ్చిన వారిపై ఓ కన్నేసింది.

Advertisement

రోబో సమాచారం.. ఇద్దరు అరెస్ట్

ప్రతి ఒక్కరి ఫొటోలు తీసి తన వద్దనున్న డేటాతో పోల్చి చూస్తోంది. అది ఓకే అయితే పోలీసులకు అలర్ట్ సమాచారం ఇస్తుంది. సరిగ్గా అలాగే చేసిన రోబో అర్జున్,  ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఇద్దరు పాత నేరస్థులను గుర్తించింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. రోబో చెప్పిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద ప్రయాణ టికెట్ లేదని గుర్తించారు.

పట్టుబడిన పాత నేరస్థులు శివ, బంగారుగా గుర్తించారు పోలీసులు. వారిపై రాయగడ పోలీస్‌స్టేషన్‌లో అనేక కేసులు ఉన్నట్టు తేలింది. దీంతో రాయగడ పోలీసులకు సమాచారం ఇచ్చారు రైల్వే పోలీసులు. పాత నేరస్థుల్ని గుర్తించడంలో ఏఐ ఆధారిత రోబో సేవలు బాగున్నాయని రైల్వే డీఆర్‌ఎం లలిత్‌ బోహ్ర చెప్పారు. భవిష్యత్తులో నేరాలు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

ALSO READ: కమిటీకి ఆధారాలు.. త్వరలో అన్ని నిజాలు బయట పెడతానన్న అరవ శ్రీధర్

విశాఖ స్టేషన్‌లో పట్టుబడిన ఇద్దరు నేరస్థులు రాయగడ‌లో భారీ దొంగతనాలు, దోపిడీలు, దాడులు, ఆయుధ సంబంధిత నేరాలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్టు తేలింది. పట్టుబడిన ఇద్దరు నేరస్థులు టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించడంతో వారిపై భారతీయ రైల్వే చట్టం ప్రకారం చర్యలు మొదలుపెట్టారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×