E-Paper
Advertisement

Markapuram Accident: ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 20 మంది సజీవ దహనం, మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం

Markapuram Accident: ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 20 మంది సజీవ దహనం, మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం
Advertisement

Markapuram Accident: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలకల క్వారీల వద్ద టిప్పర్ ను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్పాట్ లో 20 మంది సజీవదహనమయ్యారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

మర్కాపురం జిల్లాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం 

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వారీల వద్ద ట్రావెల్స్ బస్సు.. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది. వెంటనే మంటలు బస్సుని చుట్టుముట్టాయి. అప్పటికి ప్రయాణికులు నిద్రలో ఉన్నారు.

ప్రయాణికులు తేరుకునే లోపు 20 మంది సజీవ దహనమయ్యారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లా పామూరు ట్రావెల్ బస్సు వెళ్తోంది. ఘటన సమయంలో బస్సులో దాదాపు 40 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్నారు పోలీసులు. మరో 23 మంది గాయపడ్డారు.

Advertisement

టిప్పర్‌ని ఢీ కొన్న ట్రావెల్ బస్సు.. 10 మంది ప్రయాణికులు సజీవ దహనం

వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈలోగా సమీపంలోని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది. గురువారం ఉదయం 6 నుంచి 6.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నిర్మల్ నుంచి నెల్లూరు జిల్లా ఉదయగిరికి వెళ్తోంది ఈ ట్రావెల్ బస్సు.

ప్రమాదంలో బస్సు పూర్తిగా దహనం కావడంతో ఏ ట్రావెల్‌కి చెందినది అనేది స్పష్టత రాలేదు. ప్రమాదానికి ముందు మార్కాపురంలో కొంతమంది ప్రయాణికులు దిగిపోయారు. మార్కాపురం దాటిన బస్సు మూడు కిలోమీటర్లు వెళ్లగానే ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 10 మంది ప్రయాణికులు బయటపడ్డారని సమాచారం. లోపల 10 నుంచి 20 మంది ప్రయాణికులు ఉండవచ్చని ఓ అంచనా. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×