E-Paper
Advertisement

Araku Road Accident : అరకులోయలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Araku Road Accident : అరకులోయలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
Advertisement
Araku valley road accident
Araku valley road accident

Road Accident in Araku Valley(Local news andhra Pradesh): మహాశివరాత్రి సందర్భంగా జరిగిన జాతరకు వెళ్లి వస్తూ.. రోడ్డుప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అరకులోయలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరకులోయ – లోతేరు రహదారిలో గల నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరుగుతోంది. ఆ జాతరకు వెళ్లి.. తిరిగి వస్తున్న రెండు బైక్ లను అరకులోయ నుంచి వెళ్తున్న బైక్ దమ్మగుడి సమీపంలో ఢీ కొట్టింది.

Read More : ఆస్ట్రేలియాలో కృష్ణాజిల్లా యువతి మృతి

Advertisement

అరకులోయ మండలం గన్నెల రహదారిలో గల మాదల పంచాయతీ నందివలస వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులు చినలబుడు ప్రాంతానికి చెందిన బురిడీ హరి (17), గొల్లూరి అమలాకాంత్ (13), లోతేరుకు చెందిన త్రినాథ్ (32), భార్గవ్ (4)లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×