E-Paper
Advertisement

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు దుర్మరణం

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు దుర్మరణం
Advertisement

Road Accident in Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల మండలం అంజీపురం టోల్ ప్లాజా సమీపంలో ఓ లారీ ఆగి ఉంది. అయితే బైక్ పై ప్రయాణిస్తున్న వారు ఆగి ఉన్న లారీ కనిపించకపోవడంతో బలంగా వెనుకనుంచి ఢీకొట్టారు. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

మృతులు నాగతేజరెడ్డి, ఇందు, అమూల్యగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుందని, వీరంతా గురజాలలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.  ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామ పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×