// // RK Roja: చంద్రబాబును మించిపోయిన లోకేష్.. కూటమి సర్కార్‌పై రోజా విమర్శల వర్షం! -->
E-Paper
Advertisement

చంద్రబాబును మించిపోయిన లోకేష్.. కూటమి సర్కార్‌పై రోజా విమర్శల వర్షం!

చంద్రబాబును మించిపోయిన లోకేష్.. కూటమి సర్కార్‌పై రోజా విమర్శల వర్షం!
Advertisement

RK Roja: వైసీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలు ఎక్కడంటూ ఆమె ఘాటుగా ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఏమైంది? ప్రతి మహిళకు నెలకు ఇస్తానన్న రూ. 1,500 ఎక్కడ ఇచ్చారు? అంటూ నిలదీశారు. కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మఒడి లాంటి పథకాలను కూడా సరిగ్గా అమలు చేయడం లేదని, అలాంటప్పుడు సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అయిందంటూ మండిపడ్డారు. లోకేష్ విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా మూలకు చేరిందని ఆమె ఎద్దేవా చేశారు. ‘నీవు మంత్రిగానే పనికి రావని అందరూ అంటుంటే.. నిన్ను మీ నాన్న ఏదో చేయాలని చూస్తున్నాడు’ అంటూ లోకేష్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇళ్ల నిర్మాణాల విషయంలోనూ కూటమి సర్కార్ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని రోజా ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో కట్టిన ఇళ్లకు కేవలం రంగులు వేసుకుని, తామే లక్షల ఇళ్లు ఇచ్చామంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. 10 లక్షల సున్నా వడ్డీ రుణాల ఊసే లేదని, అసలు పథకాలే ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.

Advertisement

ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పైనా రోజా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ఇన్ని తప్పులు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ప్రజల తరపున ప్రశ్నించాల్సింది పోయి, రివర్స్‌లో ప్రజలపైనే ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ తీరును ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.

Also Read: కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఖబర్దార్.. ముసుగు వీరులకు పి.వి.ఎన్. మాధవ్ హెచ్చరిక!

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×