E-Paper
Advertisement

Ananthapur News: కలెక్టరేట్‌లో రెవిన్యూ అధికారి.. ఆన్‌‌లైన్‌లో జాకీ-ఆసుతో బిజీ

Ananthapur News: కలెక్టరేట్‌లో రెవిన్యూ అధికారి.. ఆన్‌‌లైన్‌లో జాకీ-ఆసుతో బిజీ
Advertisement

Ananthapur News: నేను మారాను.. మీరు మారండి.. లేదంటే 1996 సీఎంను చూస్తారని పదే పదే అధికారులను హెచ్చరిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అయినా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడలేదు. అందుకు ఎగ్జాంఫుల్ అనంతపురం జిల్లా రెవిన్యూ అధికారి. ఓ వైపు కమిషన్ ఛైర్మన్ మీటింగ్ జరుగుతుండగా, ఆయన మాత్రం రాణి, జాకీ, ఆసు గేమ్‌లో నిమగ్నమయ్యారు ఈ పేకాట పాపారావు.

ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తోంది. జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు జిల్లా రెవిన్యూ అధికారి మలోల స్వాగతం పలికారు. ఆ తర్వాత రెవెన్యూ భవన్‌లో ఛైర్మన్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లు హాజరయ్యారు.

Advertisement

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం- అనుకూలం వర్గాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు అక్కడికి వచ్చారు. రెవెన్యూ భవన్ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే ఈ సమావేశం తనకు ఏమాత్రం సంబంధ లేదని భావించారాయన. కమిషన్ ఛైర్మన్‌కు కూతవేటు దూరంలో కూర్చొన్నారు.

ఇంత జరుగుతున్నా జిల్లా రెవిన్యూ అధికారి-డిఆర్ఓ మల్లాల తనకు ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. జేబులోని తన స్మార్ట్ ఫోన్ బయటకు తీసి ఆన్ చేసి హాయిగా రమ్మీ ఆడుతూ బిజి బిజీగా కనిపించారు. రాణి-జాకీ-ఆసుల ప్రపంచంలో మునిగిపోయారు. తనవైపు ఎవరైనా చూస్తున్నారా భావించి.. ఆట మధ్యలో అటు ఇటు చూడడం మొదలుపెట్టారు.

Advertisement

ALSO READ: దావోస్ వెళ్లి చేసిందా ఇదా? చంద్రబాబు టీమ్‌పై అంబటి సెటైర్లు

దీనికి సంబంధించి అధికారి వెనకున్న మరొకరు ఈ తతంగాన్ని తన ఫోన్‌లో రికార్డు చేశారు. మలోల వ్యవహారంపై విమర్శలు తీవ్రమయ్యాయి. తన కార్యాలయంలో డీఆర్వో మలోల పేకాట ఆడటమే పనిగా పెట్టుకున్నారన్నది కొందరు కలెక్టరేట్ ఉద్యోగుల మాట. ఆయనపై పైస్థాయి అధికారులు  ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మరోవైపు కలెక్టర్ పక్కనే రమ్మీ ఆడిన డీఆర్ఓ మలోలపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సీరియస్ అయ్యారు. మలోలపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారుల పక్కన పెట్టుకొని రమ్మీ గేమ్ ఆడటం‌పై సీరియస్ అయ్యారు. DRO మలోలపై ఇదివరకే ఇలాంటి ఆరోపణలున్నాయి. దీంతో DRO మలోలపై చర్యలకు సిఫార్సు చేసే అవకాశమున్నట్లు కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×