E-Paper
Advertisement

Amaravati Republic Day celebrations: అమరావతిలో తొలిసారి.. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ప్రభుత్వ లక్ష్యాలను వివరించిన గవర్నర్ నజీర్

Amaravati Republic Day celebrations: అమరావతిలో తొలిసారి.. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ప్రభుత్వ లక్ష్యాలను వివరించిన గవర్నర్ నజీర్
Advertisement

Amaravati Republic Day celebrations: 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే విధంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. కాలాను గుణంగా పాలన మారాలనేది ఏపీ ప్రభుత్వ సిద్ధాంతమన్నారు. సాంకేతికతతో క్షణాల్లో పాలన చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు

Advertisement

సుపరిపాలనకు పది సూత్రాలు నిర్దేశించిన గవర్నర్, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కొన్నేళ్లుగా ఏపీ స్పష్టమైన దిశ లేకుండా సాగిందన్నారు. రాజధాని నిర్మాణం ఆగిపోయిందన్న గవర్నర్,  దీనివల్ల ఆర్థిక విశ్వాసం దెబ్బతిందన్నారు. ప్రజలే ప్రగతికి నిజమైన శిల్పులుగా వర్ణించారు. ప్రజల విశ్వాసం మళ్లీ మొదలైందని వివరించారు.

ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించింది. రాయపూడిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఈ వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఆ తర్వాత ప్రసంగించారు.

Advertisement

జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్, ప్రభుత్వ లక్ష్యాలు వెల్లడి

ప్రతీ పౌరుడికి గౌరవం, అవకాశాలు, న్యాయం చేస్తామన్నారు. కలిసికట్టుగా ఆరోగ్యం, ఆనందం, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామన్నారు. ప్రతీ గ్రామం సుభిక్షంగా, ప్రతీ పట్టణం చైతన్యవంతంగా ఎదిగేలా నిర్మిద్దామన్నారు. అంతేకాదు ప్రతీ నగరం సుస్థిరంగా ఎదిగే రాష్ట్రాన్ని మనం నిర్మిద్దామన్నారు.

నీటి భద్రత, ఇంధనం, అగ్రి టెక్, మౌళిక సదుపాయాల లక్ష్యాలను ఈ సందర్భంగా వివరించారు. దీనికితోటు బ్రాండ్ ఏపీ, స్వచ్ఛాంధ్ర, స్మార్ట్ గవర్నెన్స్ లక్ష్యాలను వివరించారు. దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్పేస్ సిటీ ఏర్పాటుతో ఏపీని ఆవిష్కరణల కేంద్రంగా నిలబెడుతున్నామని తెలియజేశారు.

ALSO READ: దొంగ సారా అమ్మి దొరికిపోయి విమర్శలా?.. జోగి రమేశ్ కు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

వాట్సాప్ లోనే 119 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయన్న గవర్నర్, డ్రోన్ రాజధానిగా ఏపీ ఎదుగుతోందన్నారు. ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, స్పీకర్, హైకోర్టు న్యాయమూర్తులు,  ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు రాజధాని రైతులు కూడా హాజరయ్యారు.

ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిబింబించేలా 22 శకటాలను ప్రదర్శించారు. వందేమాతరం ఇతివృత్తం, జీరో పావర్టీ మిషన్ ప్రణాళిక, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య, స్త్రీ, శిశు సంక్షేమం, నైపుణ్య శిక్షణ, ఉపాధి, అటవీ శాఖలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×