E-Paper
Advertisement

Relation between Jail and CM post in Telugu States: అదో సెంటిమెంట్, జైలుకెళ్తే సీఎం ఖాయం

Relation between Jail and CM post in Telugu States: అదో సెంటిమెంట్, జైలుకెళ్తే సీఎం ఖాయం
Advertisement

Relation between Jail and CM post in Telugu States: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. కౌంటింగ్ మొదలు పెట్టిన నుంచి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలు ఇలా ఏది చూసినా టీడీపీ కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఈ తరహా సునామీ ఎన్టీఆర్ హయాంలో కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు మాత్రమే.

ఎన్నాళ్లుకు ఏపీ అంతటా పసుపుమయమైంది. అధికార వైసీపీ జాడ కనిపించ లేదు. కనీసం ప్రతిపక్షం హోదా అయినా వస్తుందా అనే చర్చ ఏపీ అంతటా మొదలైంది. దీనికి కారణమేంటి? కాకపోతే ఓ సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వెంటాడుతోంది. జైలుకి వెళ్లిన కీలక నేతలు ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు ఏపీ, తెలంగాణలో కనిపిస్తున్నాయి.

Advertisement

ఉమ్మడి ఏపీలో అప్పటి వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్లారు. కానీ 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. 2019లో మాత్రమే విజయం సాధించింది. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్‌రెడ్డి జైలుకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం జరిగింది. ఇక స్కిల్స్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు రెండునెలలపాటు రాజమండ్రి జైలులో గడిపారు. తాజా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు.

ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యనేతలు ఎవరైనా జైలుకి వెళ్తే కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారనేది ముగ్గురు నేతలే ఇందుకు ఉదాహరణ. ఈసారి టీడీపీ గెలవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందరూ కూటమి కారణమని అంటారు. కానీ అసలు విషయం అది కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నా రంటే అందుకు కారణం సీఎం జగన్. ఇది ముమ్మాటికీ నిజమని సొంత పార్టీలే చెప్పుకోవడం కొసమెరుపు.

Advertisement

ALSO READ: వైసీపీ కంచుకోట బద్దలు, కడపలో ఫ్యాన్ కుదేలు, 8 సీట్లలో కూటమి జోరు

జగన్ దూకుడు పాలనకు టీడీపీ కేడర్ కకావికలమైంది. కాకపోతే బాబును జైలుకి పంపిన తర్వాత కేడర్‌లో కసి రగిలింది. దాని ఫలితమే బాబు తన రాజకీయ బుర్రకు పదునుపెట్టారు. ఈ క్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడ్డాయి. దీనికితోడు జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది. ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలను మార్చడం కూడా ఫ్యాన్ పార్టీని బాగా దెబ్బకొట్టింది. కర్ణుడి చావ వెనుక కారణాలు అనేకం అన్నట్లు.. వైసీపీ ఓటమి వెనుక ఒక్కటీ రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఈ ఐదేళ్లలో చాలానే ఉన్నాయి. ఇకముందైనా రాబోయే పాలకులు ఆయా విషయాలు గుర్తెరిగి పాలిస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×