E-Paper
Advertisement

Rain forecast: కీలక హెచ్చరిక.. రేపటివరకు మీరు అక్కడికి వెళ్లొద్దు

Rain forecast: కీలక హెచ్చరిక.. రేపటివరకు మీరు అక్కడికి వెళ్లొద్దు
Advertisement

Rain forecast for AP, Telangana: వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. సముద్రంలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్లొద్దని సూచించింది. అదేవిధంగా సంబంధిత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నది.

బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి రెమాల్ తుఫాను ఉధృతంగా మారి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్నది. ఆ తీవ్ర తుఫాను అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశముందని.. ఈ క్రమంలో తీర ప్రాంతాల్లో భారీగా సుమారు 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రెమాల్ తుఫాను ఉధృతంగా మారి తీవ్ర తుఫాను కొనసాగుతున్న క్రమంలో బెంగాల్ లోని తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్యం రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొన్నది. అదేవిధంగా ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

కాగా, నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలి ఉన్న భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి.

Also Read: నాకైతే నమ్మకం లేదు.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు

Advertisement

ఆదివారం వరకు నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ తరువాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×