E-Paper
Advertisement

Arava Sridhar: సాయం పేరుతో రాత్రి వేళల్లో టార్చర్ చేసేది.. నా కొడుకు అమాయకుడు, ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ ఆవేదన

Arava Sridhar: సాయం పేరుతో రాత్రి వేళల్లో టార్చర్ చేసేది.. నా కొడుకు అమాయకుడు, ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ ఆవేదన
Advertisement

రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఇటీవల వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ మీడియా ముందుకు వచ్చి తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు అత్యంత అమాయకుడని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అతడిపై బురదజల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులు..

Advertisement

ఆరోపణలు చేస్తున్న సదరు మహిళకు తమ కుటుంబానికి మధ్య ఉన్న పరిచయంపై ప్రమీలమ్మ స్పష్టత ఇచ్చారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, ఆమె తమ ఇంటికి తరచుగా వచ్చి వెళ్తుండేదని తెలిపారు. అయితే, ఈ చనువును ఆసరాగా చేసుకుని సాయం పేరుతో ఆమె గత కొంతకాలంగా ఎమ్మెల్యేను వేధిస్తోందని ఆరోపించారు. అర్ధరాత్రి వేళల్లో కూడా ఫోన్లు చేసి, ఇంటికి వచ్చి టార్చర్ పెట్టేదని, దీనివల్ల తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని ఆమె పేర్కొన్నారు.

ముందే పోలీసులకు ఫిర్యాదు చేశాం..

Advertisement

సదరు మహిళ వేధింపులు మితిమీరిపోవడంతో, తాము గతంలోనే రైల్వేకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రమీలమ్మ వెల్లడించారు. తన కుమారుడికి ఉన్న మంచి పేరును, రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఆమె పక్కా ప్రణాళికతో ఈ నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే ఉద్దేశంతోనే తాము ఇప్పటివరకు ఓపిక పట్టామని, కానీ ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేను అబాసుపాలు చేసేలా వ్యవహరిస్తోందని అన్నారు.

రాజకీయ కుట్రపై అనుమానం..

ఈ మొత్తం వ్యవహారం వెనుక ప్రతిపక్ష వైసీపీ నాయకుల హస్తం ఉందనే అనుమానాన్ని ప్రమీలమ్మ వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే, ఇలాంటి నీచమైన ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆమె వెనుక ఎవరున్నారో, ఎవరు నడిపిస్తున్నారో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను గ్రహించకుండా తన కుమారుడిపై తప్పుడు ప్రచారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

ALSO READ: Janasena MLA: జనసేన ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్.. పవన్‌కు ట్యాగ్ చేస్తూ వైసీపీ సంచలన ట్వీట్..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×