E-Paper
Advertisement

Janasena MLA: జనసేన ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్.. పవన్‌కు ట్యాగ్ చేస్తూ వైసీపీ సంచలన ట్వీట్..

Janasena MLA: జనసేన ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్.. పవన్‌కు ట్యాగ్ చేస్తూ వైసీపీ సంచలన ట్వీట్..
Advertisement

Janasena MLA:  రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే విప్ అరవ శ్రీధర్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేకు సంబంధించిన కొన్ని వీడియో కాల్ దృశ్యాలు, వాట్సాప్ చాట్‌లను వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టించింది.

ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగినిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని తెలుస్తోంది. సదరు మహిళకు అప్పటికే వివాహమై మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే.. ఆమెను భయపెట్టి అక్రమ సంబంధం కొనసాగించారని వైసీపీ పేర్కొంది. ఒకానొక దశలో ఆ మహిళ గర్భం దాల్చగా.. ఎమ్మెల్యే ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించారని కూడా ఆరోపణలు వచ్చాయి.

Advertisement

ఈ వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. సదరు మహిళ తన కోరిక తీర్చకపోతే ఆమె మూడేళ్ల కొడుకును చంపేస్తానని శ్రీధర్ బెదిరించినట్లు ఆరోపిస్తోంది. అలాగే.. బాధితురాలి భర్తకు కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం బాధితురాలి భర్తకు తెలియడంతోనే బయటపడిందని సమాచారం.

ఈ వ్యవహారంపై స్పందించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత, లోకేశ్‌లను ట్యాగ్ చేస్తూ వైసీపీ పోస్టులు పెట్టింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, మహిళలను రక్షించాల్సిన ఎమ్మెల్యే ఇలాంటి చర్యలకు పాల్పడటంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

Advertisement

ALSO READ:వీధి కుక్కల వేట.. చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు.. ఖైరతాబాద్‌లో కలకలం

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×