E-Paper
Advertisement

Congress Party: మొదలుపెట్టిన దగ్గర నుంచే.. ఏపీకి ఖర్గే, రాహుల్, సోనియా రాక.. ఆపై ఆందోళనలు

Congress Party: మొదలుపెట్టిన దగ్గర నుంచే.. ఏపీకి  ఖర్గే, రాహుల్, సోనియా రాక.. ఆపై ఆందోళనలు
Advertisement

Congress Party: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దూకుడు పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఇకపై నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఏపీ నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండున కాంగ్రెస్ అగ్రనేతలు అక్కడికి రానున్నారు. 

ఫిబ్రవరి రెండున ఏపీకి కాంగ్రెస్ అగ్రనేతలు

Advertisement

మధ్యకాలంలో మోదీ సర్కార్.. అభివృద్ధి పేరిట రకరకాలుగా పేర్లు మార్చడం మొదలు పెట్టింది. చివరకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాల పేర్లను మార్చుతోంది. కాంగ్రెస్ మానస పుత్రికగా పేర్కొన్న పథకాల్లో ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ’ ఒకటి. ఆ పథకాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ‘వీబీ జీ రామ్‌ జీ’గా మార్చేసింది.

Advertisement

దీనిపై పార్లమెంటు ఉభయసభల్లో ఆ పార్టీ నేతలు ఆందోళన చేశారు. అయినా ఎన్డీయే ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలని కాంగ్రెస్ అగ్రనేతలు డిసైడ్ అయ్యారు. ఈ పథకం కోసం ఆందోళనలు చేయడానికి ఎందుకు ఏపీని ఎంచుకున్నారు? అన్న డీటేల్స్ లోకి లోతుగా వెళ్దాం.

మొదలు పెట్టిన నుంచే ఆందోళనకు శ్రీకారం

రెండు దశాబ్దాల కిందటి మాట. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004లో కొలువు దీరింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ హయాంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని 2006, ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఆనాటి నుంచి నేటివరకు అంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ పథకం సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది. పథకం పేరు మార్చడం, దానికి మార్పులు చేర్పులు చేయడం జరిగింది.

ALSO READ: గజగజ వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఆ పథకం మొదలు పెట్టారో కాంగ్రెస్ పెద్దలు, అక్కడి నుంచి ఆందోళనలు దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టాలని ఇటీవల జరిగిన సీడబ్య్లూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2న ఏపీకి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలు రానున్నారు. అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని బండ్లపల్లి నుంచి ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ ఆందోళన ద్వారా మోదీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టనున్నారు. అంతేకాదు అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×