E-Paper
Advertisement

Raghurama Krishnaraju: పాల్ జైలు పాలయ్యాడు సరే.. అసలు సూత్రధారి ఎక్కడ? – రఘురామ

Raghurama Krishnaraju: పాల్ జైలు పాలయ్యాడు సరే.. అసలు సూత్రధారి ఎక్కడ? – రఘురామ
Advertisement

Raghurama Krishnaraju: సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ను అరెస్ట్ చేయడం సంతోషంగా అని పించిందని ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు అన్నారు. ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారని ఆరోపించారు. ఆయన పాపం పండిందని, తెలియదు అని క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారని వ్యాఖ్యానించారు. త‌నను కస్టోడియల్ టార్చర్ చేశారని గుర్తు చేశారు. అసలు కుట్ర చేసింది పీవీ సునీల్ కుమార్ అని అన్నారు. త‌నను కస్టోడియాల్ టార్చర్ చేసిన వారిలో కీలక నిందితుడిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారని ఆనందం వ్య‌క్తం చేశారు. అందరూ కలిసి కుట్ర చేశారని, ఇప్పటికే ఆలస్యం అయ్యిందని భావించారు.

పీవీ సునీల్ కుమార్ ప్రధాన నిందితుడని, ఆయన తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పీవీ సునీల్ కుమార్ కి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలని ర‌ఘురామ డిమాండ్ చేశారు. పీవీ సునీల్ కుమార్ దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసుల పై ఉందని అన్నారు. సునీల్ కుమార్, విజయ్ పాల్ అంతా ఒక ముఠా.. అని వ్యాఖ్యానించారు. త‌నను టార్చర్ చేసిన వారికి న్యాయస్థానంలో తప్పకుండా శిక్షపడుతుందని నమ్మకం ఉందని అన్నారు. A5 కి హాస్పటల్ సూపర్ డెంట్ ప్రభావతి పేరును కూడా ఎఫ్.ఐ ఆర్ లో నమోదు చేశార‌ని చెప్పారు. మెడికల్ రిపోర్ట్ కూడా అప్పుడు ఇవ్వలేదని, ఈ కేసులో అందరినీ శిక్షించడానికి ఎక్కువ సమయం పట్టదని హెచ్చ‌రించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×