E-Paper
Advertisement

Fish @ Rs. 2 Lakhs: దేవుడా.. ఒక్క చేప ధర రూ. 2 లక్షలు.. ఎక్కడో తెలుసా?

Fish @ Rs. 2 Lakhs: దేవుడా.. ఒక్క చేప ధర రూ. 2 లక్షలు.. ఎక్కడో తెలుసా?
Advertisement

Single Fish Price is 2 Lakh Rupees: చేపలు పట్టే జాలర్లకు కొన్ని సార్లు ఎంత వెతికినా సరైన చేపలు దొరకవు. ఎన్ని చేపలు దొరికినా వాటిలో అద్భుతమైన చేపలు దొరకడం చాలా అరుదు. అదే ఒక్కసారి జాలర్ల చేతికి చిక్కాయంటే చాలు ఏకంగా వేలు, లక్షల్లోనే రేటు పలుకుతుంది. తాజాగా ఏపీలో అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. ఒక మత్స్యకారుడి చేతికి ఏకంగా లక్షల విలువ చేసే చేపలు చిక్కాయి. దీనికి సంబంధించిన ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

సాధారణంగానే పులుస చేపలు అత్యధిక ధర పలుకుతాయి. ఎందుకంటే వాటి రుచి, వాసన అనేది మాంసంప్రియులకు అంత మక్కువ. వేల రూపాయలు ఖర్చు చేసి మరి పులుస చేపలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ పులుస చేపలకు మరో పేరు కూడా ఉంది. వీటినే కచ్చిడీ చేపలు అని కూడా అంటారు.

Advertisement

ఒక్క చేప అంత కొడితే రూ. 300 నుంచి రూ. 500లోపు ఉంటుంది. ఇక సీజన్, చేపలను బట్టి ఇక వేల రూపాయలు ఉంటాయి. కానీ ఏపీలో చేప మాత్రం ఏకంగా లక్షల రూపాయల ధర పలుకుతుంది. పులుస చేపలకు ధర ఎక్కువ ఉంటుందని తెలిసిందే.. కానీ మరీ లక్షల్లో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. అంతర్వేదీ సముద్ర తీరంలో ఓ చేప ఏకంగా రూ. 2 లక్షలు పలికింది. రెండు కచ్చిడి చేపలు కలిపి రూ. 4 లక్షలు పలికింది. దీనిని డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపల్లి పాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో దీనిని వేలం వేశారు. ఏకంగా రెండు చేపలకు రూ. 4 లక్షలు పలకడం హాట్ టాపిక్ గా మారింది. దీనిని కొనుగోలు చేసి తినాలంటే ఇక కోటిశ్వరులకు మాత్రమే సాధ్యం అని అందరూ చర్చించుకుంటున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×