E-Paper
Advertisement

Andhra Pradesh: కేంద్రం భారీ కేటాయింపులు.. పప్పుధాన్యాల మిషన్‌తో మారనున్న ఏపీ వ్యవసాయ రూపురేఖలు!

Andhra Pradesh: కేంద్రం భారీ కేటాయింపులు.. పప్పుధాన్యాల మిషన్‌తో మారనున్న ఏపీ వ్యవసాయ రూపురేఖలు!
Advertisement

Andhra Pradesh: దేశాన్ని పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్త) దిశగా నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యతనిస్తూ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్రం తన వాటాగా రూ. 1665.13 లక్షల నిధులను మంజూరు చేసింది. లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు.

ఏపీకి 22 ప్రాసెసింగ్ యూనిట్లు
రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడమే కాకుండా, పండించిన పంటకు విలువ జోడింపు (Value Addition) చేసేందుకు కేంద్రం 22 ప్రాసెసింగ్ యూనిట్లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. దీనివల్ల రైతులకు తమ ఉత్పత్తులను నేరుగా ప్రాసెస్ చేసుకునే అవకాశం కలగడమే కాకుండా, మార్కెట్‌లో మెరుగైన ధర లభించే వీలుంటుంది. కేవలం సాగుకే పరిమితం కాకుండా, నిల్వ సామర్థ్యం, పారిశ్రామిక తోడ్పాటును అందించడం ఈ పథకం యొక్క ప్రత్యేకత.

Advertisement

రైతులకు శిక్షణ, ప్రదర్శనలు
ఈ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్షేత్రస్థాయి కార్యక్రమాలను చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1560 బ్లాక్ డెమోన్స్ట్రేషన్లు (సాగు ప్రదర్శనలు), 1448 శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు రూ. 130.32 లక్షలను వెచ్చించనున్నారు. ఆధునిక సాగు పద్ధతులు, అధిక దిగుబడినిచ్చే విత్తనాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా ఉత్పాదకతను పెంచడమే ఈ శిక్షణల ముఖ్య ఉద్దేశ్యం.

వేలాది మంది రైతులకు లబ్ధి
ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 18,720 మంది రైతులు క్లస్టర్ ప్రదర్శనల ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు. అలాగే, మరో 43,440 మంది రైతులు వివిధ శిక్షణ కార్యక్రమాల ద్వారా ఆధునిక వ్యవసాయ మెళకువలను నేర్చుకోనున్నారు. తద్వారా నాణ్యమైన విత్తనాల లభ్యతతో పాటు, వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడే పంటల సాగుపై రైతులకు పట్టు కలగనుంది.

Advertisement

ఆరేళ్ల లక్ష్యం – రూ. 11,440 కోట్ల వ్యయం
2025-26 నుంచి 2030-31 వరకు ఆరు సంవత్సరాల కాల పరిమితితో ఈ మిషన్ రూపొందించబడింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా కేంద్రం రూ. 11,440 కోట్లను ఖర్చు చేయనుంది. కంది (తూర్), మినప (ఉరద్), పెసర, మసూర్ వంటి ప్రధాన పప్పుధాన్యాల దిగుమతులను తగ్గించి, దేశీయంగా ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా 28 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలు కానుంది.

Also Read: తెలంగాణతో జల వివాదం.. కేంద్ర జలశక్తి మంత్రితో చంద్రబాబు భేటి.. టెన్షన్‌లో కాంగ్రెస్ నేతలు!

భవిష్యత్ లక్ష్యాలు, స్వయం సమృద్ధి
2030-31 నాటికి దేశవ్యాప్తంగా 350 లక్షల టన్నుల పప్పుధాన్యాల ఉత్పత్తిని సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు పెంచి, ఉత్పాదకతను హెక్టార్‌కు 1130 కిలోలకు చేర్చాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మిషన్ విజయవంతం కావడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు కావడమే కాకుండా, పప్పుధాన్యాల కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి తప్పుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×