E-Paper
Advertisement

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?
Advertisement

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమైందా..? ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో జగన్ సంధించిన 8 ప్రశ్నలు దేనికి సంకేతాలు..? వాస్తవానికి సిపంతీ ఓటుపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అక్కడ గెలుపుకోసం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. నేరుగా మంత్రులే ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. దీంతో వైసీపీకి ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. అయితే జగన్ సొంత నియోజకవర్గంలో ఎన్నిక కావడం, అందులోనూ మూడు దశాబ్దాలుగా ఆ స్థానంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థులే గెలుస్తూ రావడంతో.. ఇది వైసీపీ అధినేతకు ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవని తేలిపోయింది. దీంతో జగన్ ఎన్నికల ముందే అస్త్ర సన్యాయం చేసినట్టు ట్వీట్ వేశారు.

Advertisement

జగన్ ట్వీట్..
ఏపీలో రెండు జడ్పీస్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగిసింది. ఈ సమయంలో జగన్ ఓ ఆసక్తికర ట్వీట్ వేశారు. సీఎం చంద్రబాబుని అప్రజాస్వామిక, అరాచక వాదిగా పేర్కొన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారని విమర్శించారు. సీఎంగా తనకున్న అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు, వారి అడుగులకు మడుగులొత్తే అధికారులు, వారికి కొమ్ముకాసే కొంతమంది పోలీసులు.. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి ఉప ఎన్నికలను హైజాక్‌ చేయబోతున్నారని చెప్పారు జగన్.

పోలీసులపై ఆరోపణలు..
పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలకు నోటీఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు జగన్. వైసీపీ నాయకులను కార్యకర్తలను బైండోవర్‌ చేశారని, జీవితంలో ఎప్పుడూ పోలీస్‌స్టేషన్‌ గడపతొక్కని వారిని, ఎలాంటి కేసులు లేనివారిని కూడా బైండోవర్‌ చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతల్ని పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన దాడుల్ని కూడా ప్రస్తావించారు జగన్. వివాహానికి హాజరైన వారిపై కూడా దారి చేశారన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహించారన్నారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయాల్సింది పోయి.. వైసీపీ నేతలపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు జగన్. అధికారపార్టీతో చేతులు కలిపిన అధికారులు, వైసీపీ ఓట్లను తగ్గించేందుకు పోలింగ్‌ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారన్నారు. టీడీపీ ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో పోలింగ్ బూత్ లు పెట్టారని, ఆ బూత్ లు క్యాప్చర్ చేయడానికే వారు ప్లాన్ వేశారన్నారు.

Advertisement

చేతులెత్తేసినట్టేనా..?
ఎన్నికలు జరగడానికి ముందే ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని జగన్ చెప్పారంటే కచ్చితంగా ఆయనకు ఆశలు ఆవిరై ఉండాలని అంటున్నారు నెటిజన్లు. అయితే చివరగా జగన్ ఓ సెంటిమెంట్ డైలాగుతో ఆ ట్వీట్ ని పూర్తి చేయడం విశేషం. దేవుడిమీద తనకు నమ్మకం ఉందని, ప్రజలపై నమ్మకం ఉందని, అంతిమంగా ధర్మమే గెలుస్తుందని అన్నారు జగన్. ఆ నమ్మకం ఎలా ఉన్నా.. గెలుపుపై మాత్రం జగన్ కి నమ్మకం లేదని, అందుకే ఇలాంటి ట్వీట్ వేశారంటున్నారు నెటిజన్లు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×